Bharat Aawaz

జాతిపిత మహాత్మా గాంధీజీ ఆదర్శాలు ప్రతి ఒక్కరికీ ఆచరణీయం: ప్రభుత్వ విప్ గణబాబు

Santhosh Kumar
Verified User
BMA | BHARAT AAWAZ Member
2 min read
0
Comments
207
Views

గాంధీ జయంతి సందర్భంగా గోపాలపట్నం జడ్పీ హైస్కూల్‌‌లోని జాతిపిత, మహాత్మా గాంధీ గారి విగ్రహానికి ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థులు గాంధీజీ ఆదర్శాలను నిత్య జీవితంలో అలవర్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

అనంతరం పాఠశాలకు నూతనంగా ఎన్నికైన పేరెంట్స్ కమిటీ సభ్యులను ఆయన శాలువాలతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.