Madanapalle: మదనపల్లె ఎంఎస్ఆర్ సర్కిల్ వద్ద అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయిన వ్యక్తికి తక్షణ సాయం అందించి మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా, పోలీస్ సిబ్బంది.
Posted 2026-09-21 11:58:48
0
16
మదనపల్లె పట్టణంలోని ఎంఎస్‌ఆర్ సర్కిల్ వద్ద సోమవారం నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ తప్పి కిందపడిపోయాడు. గమనించిన ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ చాంద్ బాషా, తన డ్రైవర్, వన్‌టౌన్ హెడ్ కానిస్టేబుల్ సతీశ్‌తో కలిసి వెంటనే స్పందించారు. కిందపడిన వ్యక్తి ముఖంపై నీళ్లు చల్లి స్పృహలోకి తీసుకువచ్చి, ఎలాంటి ప్రమాదం జరగకుండా పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అనంతరం అతని పేరు, చిరునామా వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపటికి తేరుకున్న వ్యక్తి స్వయంగా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా సీఐ చాంద్ బాషా మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించినట్లుగా ప్రమాద పరిస్థితుల్లో ఉన్న వారికి ముందుగా సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మానవత్వంతో స్పందించి ఆ వ్యక్తికి సహాయం చేశామని తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: పేదల సంక్షేమమే టీడీపీ ధ్యేయం
బుధవారం అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ మహానాడు వైభవంగా జరిగింది. పేదల సంక్షేమమే...
Manipur's NPCM Slams "False Peace" Claims Over Highways
In a compelling press briefing, the Native People’s Committee Manipur (NPCM), led by...
పెద్దపల్లి వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు.
పెద్దపల్లి మండలం లోని పలు గ్రామాల శివారుల్లో పెద్దపల్లి రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో ఎస్ ఐ...
నూతన బస్సు సర్వీసు ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
హనుమకొండ జిల్లాలోని పరకాల నుంచి శాయంపేట మీదుగా సాధనపల్లి వరకు నూతన బస్సు సేవ ప్రారంభమైంది....