నూతన బస్సు సర్వీసు ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

0
758

హనుమకొండ జిల్లాలోని పరకాల నుంచి శాయంపేట మీదుగా సాధనపల్లి వరకు నూతన బస్సు సేవ ప్రారంభమైంది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రజా విజ్ఞప్తి మేరకు ఈ సేవను మంజూరు చేయించి శనివారం ఉదయం మండలకేంద్రంలో ఘనంగా జెండా ఊపి ప్రారంభించారు.ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితంగా ఉంటుందని ఈ సౌకర్యం విద్యార్థులకు, స్థానిక ప్రజలకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని, చిరు వ్యాపారులకు, పట్టణాలకు అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళే ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. మండలంలోని కొన్ని గ్రామాల మధ్య సరైన ప్రభుత్వ రవాణా లేకపోవడం వల్ల గతంలో ప్రజలు ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వచ్చేదని దీని వలన ఖర్చు, సమయం అధికంగా ఉండేదని కావున సామాన్య ప్రజలకు మేలు చేసే విధంగా,ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే విధంగా ఈ బస్సు సర్వీసును ప్రారంభిస్తున్నట్టు,కావున ప్రజలు ఆర్టీసీ సేవలను వియోగించుకుని తద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లి తమ వంతు సహకారాన్ని కూడా అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్, M.P.D.O ఫణిచంద్ర, మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చల్లా చక్రపాణి, మార్కెట్ వైస్ చైర్మన్ మారపెల్లి రవీందర్, మస్కే కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ, కఠోర శ్రమతోనే సాధ్యం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
సికింద్రాబాద్:  జింఖానా గ్రౌండ్స్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో...
By Sidhu Maroju 2025-09-01 09:04:42 0 387
Andhra Pradesh
కులగణన నుండి నైపుణ్యగణన వైపు.. ఒక సాహసోపేత అడుగు.
భారత రాజకీయ క్షేత్రంలో దశాబ్దాలుగా ‘కులగణన’ అనేది ఒక ప్రధాన అస్త్రంగా ఉంటూ వస్తోంది....
By John Baji 2026-01-11 04:54:34 0 237
Andhra Pradesh
Pawan Kalyan: గత ప్రభుత్వ అధినేత తప్పు చేశారని నేనెప్పుడూ చెప్పలేదు: కల్తీ నెయ్యి వ్యవహారంపై పవన్ కల్యాణ్.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారంలో గత ప్రభుత్వ అధినేత తప్పు చేశారని తాను...
By Pagadala Venkateswar 2026-02-24 09:59:36 0 201
Andhra Pradesh
పుంగనూరు: యర్రాతివారిపల్లెలో ఇరుముడి చెల్లించిన పెద్దిరెడ్డి మరియు కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం యర్రాతివారి పల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో మాజీ మంత్రి, పుంగనూరు...
By Kothuru Murali 2026-01-15 06:01:35 0 203
Andhra Pradesh
కాఫీ విత్ కబుర్లు కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
దేశాన్ని నడిపే సామర్థ్యం కలిగిన నాయకుడు సాధ్యంలో మనం పని చేస్తున్నాము పార్టీ కార్యకర్తలకు గౌరవమే...
By Benguluri Madhubabu 2026-03-25 13:43:04 0 249
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com