గంగమ్మ ఒడికి గణనాథులు.. భక్తి పారవశ్యంలో నిమజ్జనాలు.|
● మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 11,629 గణనాథులకు జలాధివాసం
● అల్వాల్ చెరువులోనే 1,810 విగ్రహాలకు నిమజ్జనం
● మల్కాజిగిరి జోన్‌లో అత్యధికంగా 6,301 విగ్రహాలు
● ప్రధాన శోభాయాత్రలు పూర్తికాకముందే భారీగా నిమజ్జనాలు
అల్వాల్, సెప్టెంబర్ 20: వినాయక నవరాత్రుల అనంతరం గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. నిమజ్జనాలతో అల్వాల్ చెరువు పరిసరాలు భక్తి సందడితో కళకళలాడుతున్నాయి.
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్ 14 నుంచి 19వ తేదీ ఉదయం 6 గంటల వరకు 11,629 గణేష్ విగ్రహాలకు జలాధివాసం నిర్వహించారు. ఇందులో ఒక్క అల్వాల్ చెరువులోనే 1,810 విగ్రహాలు నిమజ్జనం కావడం విశేషం.
కమిషనరేట్ పరిధిలోని నిమజ్జనాల వివరాలను పరిశీలిస్తే.. 8,389 విగ్రహాలు మూడు అడుగులలోపు ఎత్తులో ఉండగా, మరో 3,240 విగ్రహాలు మూడు అడుగులు, అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి.
జోన్ల వారీగా మల్కాజిగిరి జోన్ 6,301 విగ్రహాలతో ముందుండగా, ఎల్‌బీనగర్ జోన్‌లో 3,412, ఉప్పల్ జోన్‌లో 1,916 విగ్రహాలకు నిమజ్జన ప్రక్రియ పూర్తయింది.
అల్వాల్‌తో పాటు హస్మత్‌పేట్ చెరువు కూడా గణనాథుల నిమజ్జనాలకు వేదికగా నిలిచింది. అక్కడ 3,274 విగ్రహాలకు జలాధివాసం కల్పించగా, సరూర్‌నగర్ చెరువులో 2,193, కృత్రిమ నిమజ్జన కొలనులో 609 విగ్రహాలను నిమజ్జనం చేశారు.
ఇక ప్రధాన గణేష్ నిమజ్జన శోభాయాత్రలు పూర్తికాకపోవడంతో రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భారీ విగ్రహాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే గణనాథులతో నిమజ్జన కేంద్రాల వద్ద భక్తి వాతావరణం కొనసాగుతోంది.
#Sidhumaroju
Alwal
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz