ఏపీలో కొలువుల జాతర.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.

0
69

 

అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ తో పాటు రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ నిబంధనల మార్పు

ఇప్పటికే ఏపీపీఎస్సీ, పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఏపీ ఫైర్ సర్వీసెస్ (అగ్నిమాపక) శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (SLPRB) ప్రాథమిక ప్రకటనను జారీ చేసింది. అయితే ఈసారి నియామక విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో కేవలం ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌ (PMT) ఆధారంగా మాత్రమే ఈ ఎంపికలు జరగగా, ప్రస్తుత నోటిఫికేషన్‌లో ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌ (PET)తో పాటు రాత పరీక్షను కూడా తప్పనిసరి చేస్తూ నిబంధనలు సవరించారు.

 

 

దరఖాస్తుల స్వీకరణ తేదీలు, అర్హతలు, వయోపరిమితి మరియు రాతపరీక్షల విధానంతో కూడిన సమగ్ర నోటిఫికేషన్ షెడ్యూల్‌ను ఎస్‌ఎల్‌పీఆర్‌బీ త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఏపీపీఎస్సీ ద్వారా 892 ఖాళీలకు, పోలీస్ శాఖలో 2,050 ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువడగా... తాజాగా అగ్నిమాపక శాఖలో మరిన్ని పోస్టులు తోడవడంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.

Search
Categories
Read More
BMA
Safe Spaces Lost: The Takeover of Indian Press Clubs
Historic press clubs across major Indian cities, traditionally serving as independent safe...
By JoinBMA 2026-08-21 08:56:01 0 72
Telangana
నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ తనిఖీలు తూప్రాన్ డిఎస్పీ. జే.నరేందర్ గౌడ్
మెదక్ జిల్లా:    అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవు....
By Sidhu Maroju 2025-07-10 16:12:41 0 1K
Andhra Pradesh
తాడేపల్లిలో జండా ఊపి కోటి సంతకాల పత్రాలు ఉన్న వాహనాలు ప్రారంభించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి
తాడేపల్లిలో జెండా ఊపి కోటి సంతకాల ప్రతులు ఉన్న వాహనాలను ప్రారంభించిన వైయస్‌ జగన్‌...
By Rajini Kumari 2025-12-18 07:40:24 0 245
Andhra Pradesh
చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో టిడిపిలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి.
చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో టిడిపిలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి.  ...
By Gadiyapudi Narendra 2026-01-10 16:40:05 0 295
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: చిరుత దాడి దూడ మృతి, రైతు ఆవేదన
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని ముదిరెడ్డిపల్లిలో ఆదివారం చిరుత దాడిలో ఒక దూడ మృతి...
By Kothuru Murali 2026-03-02 04:19:31 0 207
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com