సూరారంలో యువకుడు మిస్సింగ్.|

0
90

అల్వాల్, సెప్టెంబరు 15:సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిమితుల్లో ఓ వికలాంగ యువకుడు తప్పిపోయాడు.

బాధితుడి తండ్రి మన్సూర్ మొహమ్మద్ ఆజం షేక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వివరాల ప్రకారం, భగత్ సింగ్ నగర్‌కు చెందిన షేక్ జుబేర్ (26) అనే యువకుడు ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో హమీద్ బస్తీలోని మసీదుకు వెళ్తానని చెప్పి ఇంట నుండి బయటకు వెళ్లాడు.

రోజులు గడుస్తున్నా అతను తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో తండ్రి సూరారం పోలీసులను ఆశ్రయించారు.తప్పిపోయిన యువకుడు పుట్టుకతోనే వికలాంగుడు.

కాళ్లు పడిపోవడంతో చేతుల సహాయంతో కింద కూర్చుని నడుస్తాడు. ఈ యువకుడు సూరారం సరిహద్దులైన అల్వాల్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల పరిసర ప్రాంతాలలో సంచరించే అవకాశం ఉన్నందున స్థానిక ప్రజలు, వ్యాపారులు గమనించాలని కోరుతున్నారు.

సుమారు ఐదున్నర అడుగుల ఎత్తు, తెల్లటి రంగు, గుండ్రటి ముఖం కలిగిన ఈ యువకుడు తప్పిపోయిన సమయంలో తెలుపు రంగు షర్ట్, హాఫ్ గ్రే ప్యాంట్ ధరించి ఉన్నాడు. ఈ ఆనవాళ్లు గల యువకుడి ఆచూకీ ఎవరికైనా లభిస్తే వెంటనే తండ్రి మొబైల్ నంబర్ 9542243581 కు గానీ లేదా సూరారం పోలీసులకు గానీ సమాచారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
నందవరం మండల బిజెపి నాయకులు ప్రతి ఒక్కరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు
నందవరం మండల కేంద్రంలో బిజెపి నాయకులు హర్ గర్ తిరంగ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఆగస్టు 15న 80 వ...
By Boya Dasthagiri 2026-08-14 15:48:11 0 175
SURAKSHA
Sujata Saunik IAS: Leading Maharashtra with Vision & Purpose
The Journey Begins "Leadership is measured not by authority, but by the positive change it...
By Fathima Safa 2026-07-20 14:33:08 0 112
Ladakh
Ladakh’s Quest for Constitutional Safeguards
The Leh Apex Body (LAB) and the Kargil Democratic Alliance (KDA) remain steadfast in their...
By Lokeshwari Panthadi 2026-07-02 05:23:01 0 81
Andhra Pradesh
చౌడేపల్లి మండలంలో టమోటా పంట ధ్వంసం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం, వెంగళపల్లి పంచాయతీ, దాసరయ్యగారిపల్లి...
By Kothuru Murali 2026-06-02 15:41:31 0 117
Andhra Pradesh
మదనపల్లి లో పోలీసుల భారీ కార్డెన్ సెర్చ్: 20 బైక్‌లు సీజ్.
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలో గురువారం తెల్లవారుజామున పోలీసులు భారీ కార్డెన్...
By Pagadala Venkateswar 2026-02-26 11:22:26 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com