5 వేల ఎకరాల్లో నేల పునరుజ్జీవనం.4,000 టన్నుల కార్బన్ ఉద్గారాల నివారణ లక్ష్యం

0
224

భారత్ అవాజ్ న్యూస్ : శ్రీ సత్యసాయి జిల్లాలో నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రాజెక్ట్ పునర్జీవనం ను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు కార్యక్రమంలో ప్రాజెక్టుపై కలెక్టర్ సమగ్ర వివరాలు వెల్లడించారు.జిల్లాలో కరువు పరిస్థితులు, నీటి ఎద్దడి, నేలలో తేమ తగ్గుదల, వ్యవసాయ వ్యర్థాల దహనం వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రాజెక్టు లక్ష్యమన్నారు. ఇటీవల 20 వేల సాయిల్ హెల్త్ శాంపిల్స్ పరిశీలించగా నేలలో సేంద్రీయ కార్బన్ శాతం 0.38 శాతం మాత్రమే నమోదైందని తెలిపారు.ఐదేళ్ల ప్రాజెక్టులో భాగంగా 5,000 ఎకరాల్లో నేల పునరుజ్జీవనం, సుమారు 4,000 టన్నుల CO₂e ఉద్గారాల నివారణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మల్బరీ వ్యర్థాలను వినియోగించి బయోచార్ తయారీ ద్వారా నేల సారాన్ని పెంచడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచనున్నట్లు కలెక్టర్ వివరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మేర వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న టిడిపి నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి పట్టణంలోని ఘనంగా నిర్వహించిన శ్రావణి నరేష్ వివాహ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-05-08 07:31:28 0 270
Andhra Pradesh
ఆదోని మెడికల్ కాలేజీ పై నారా లోకేష్ పర్యటనలో స్పష్టమైన ప్రకటన చేయాలి
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో కర్నూల్ జిల్లా పచ్చిమ...
By Boya Dasthagiri 2026-07-28 14:12:35 0 133
Andhra Pradesh
చింత మోహన్ కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్
విశాఖపట్నం, 10-1-2026, శనివారం.    చింతామోహన్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్...
By Rajini Kumari 2026-01-10 12:45:51 0 201
Andhra Pradesh
లింగాలపాడు లో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాల పోటీలను ప్రారంభించిన మాజీమంత్రి దేవినేని ఉమా
నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పేరంటాల అమ్మ వారి తిరణాల...
By Patan Khuddus 2026-05-06 17:10:35 0 270
Telangana
Huge Re-Shuffle in Telangana IAS
By Bharat Aawaz 2025-06-12 17:03:35 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com