వాట్సప్ గవర్నెన్స్, డిజిటల్ సేవలు.. పాలనలో బెస్ట్ ప్రాక్టీసెస్ పాటించాలి: ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.

0
97

ప్రభుత్వ, పరిపాలన సేవలను ప్రజలకు మరింత సమర్థంగా అందించడంపై దృష్టి సారించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపునిచ్చారు. రెండోరోజు లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌లో ప్రసంగించిన ఆయన, కొన్ని నియోజకవర్గాలు పౌర సేవల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నాయని, అన్ని నియోజకవర్గాలు ఆ ఉత్తమ పద్ధతులను (బెస్ట్ ప్రాక్టీసెస్) అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.

 

ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నామని, దీనివల్ల ఏటా రూ.1000 కోట్ల ఆదాయం వదులుకుంటున్నామని చంద్రబాబు గుర్తుచేశారు. ఎక్కడైనా ఇసుక అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిపోతే కఠినంగా అడ్డుకోవాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసి, నకిలీ బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని విమర్శించారు. ఇప్పుడు మద్యం విక్రయాల్లో పారదర్శకత తీసుకొచ్చామని, ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో అవకతవకలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలో సుజల వసతి మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన నందవరం మండల నాయకులు
నందవరం మండలం కేంద్రం ఎస్సీ కాలనీలోని ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మిగనూరు...
By Boya Dasthagiri 2026-04-13 09:43:26 0 191
Andhra Pradesh
విధ్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నికి అహుతి అయిన ఇల్లు - సర్వం కోల్పోయిన కుటుంబం
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం జె.అన్నవరం గ్రామంలో కుటుంబ సభ్యులతో నివాసం...
By BABJI DADALA 2025-12-25 08:21:11 0 400
Telangana
బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కి నోటీసులు ఇవ్వడం శోచనీయం : MLA మర్రి రాజశేఖర్ రెడ్డి.|
        మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు...
By Sidhu Maroju 2026-01-29 14:16:27 0 251
Telangana
నిజామాబాద్.పదవ తారారతి పరీక్షా కేంద్రంలో సెల్ ఫోన్ నిషేదం
మార్చి 14 నుండీ జరిగే 10వతరగతి పరీక్షలను పకడ్బంధిగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు ఇ  ఎల్...
By Sadaq Sadaq 2026-02-24 17:15:59 0 251
SURAKSHA
Wednesday UP Police: Heroes Without Badge But Heart
Today UP police officers proved heroes need no badge. Orphan children got guardians who paid...
By Kalaga Sailaja 2026-07-04 10:15:01 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com