కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీగా గంజాయి తోటలపై దాడి 460 మొక్కలు స్వాధీనం, నలుగురు అనుమానితుల అదుపు

0
381

🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్,

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను గంజాయి రహితంగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు ఉక్కుపాదం మోపారు. సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్ పరిధిలోని బూర్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల జీర్లగాట్, గుట్టగూడ గ్రామ శివార్లలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. వ్యవసాయ భూముల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న 460 గంజాయి మొక్కలను మూడు వేర్వేరు కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ అక్రమ సాగుకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్న నలుగురు వ్యక్తులను (జీర్లగాట్ గ్రామానికి చెందిన ముగ్గురు, గుట్టగూడకు చెందిన ఒకరు) పోలీసులు అదుపులోకి తీసుకుని, చట్టపరమైన కేసులు నమోదు చేశారు.

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి సాగుపై సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఎస్పీ భరోసా ఇచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఈరోజు ప్రొద్దుటూరు పర్యటనకు విచ్చేసిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ప్రొద్దుటూరు పర్యటనకు విచ్చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని జిల్లా ఆర్టిఓ...
By Benguluri Madhubabu 2026-02-13 06:39:06 0 326
Telangana
వేగం కన్నా ప్రాణం ముఖ్యం : తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి, ఐపీఎస్.
అర్ముడ్ అధికారుల, సిబ్బంది నూతన పోలీసు నివాస భవనాలను ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి,రామగుండం...
By Avunoori Mahesh 2026-04-12 16:06:03 0 182
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్‌లో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను ఈనెల 16న ఉదయం 10:30 గంటలకు వేలం.
పుంగనూరు పట్టణంలోని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్‌లో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను...
By Kothuru Murali 2026-03-15 10:17:50 0 203
Andhra Pradesh
యువజన ఉత్సవాల ముగింపులో బహుమతులు ప్రధానం చేసిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి రాంప్రసాద్ రెడ్డి
పత్రికా ప్రకటన.   గుంటూరు, కేఎల్ యూనివర్సిటీ || 20-12-2025   *వివేకానంద ఆశయాలతో...
By Rajini Kumari 2025-12-20 13:09:49 0 205
Andhra Pradesh
మొహరం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి మహోన్నత త్యాగానికి చిహ్నం మొహరం సమాజంలో శాంతి కరుణ సత్యం కోసం...
By Benguluri Madhubabu 2026-06-26 06:21:22 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com