ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు బీజేపీ కీలక బాధ్యతలు.

0
94

ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు బీజేపీ అధిష్ఠానం కీలకమైన ప్రాధాన్యాన్ని అప్పగించింది. ప్రధానమంత్రి మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమాలకు దక్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జిగా ఆయనను నియమించింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ, ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో విస్తృత ప్రజా సంక్షేమ, సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు.

 

 

ప్రజాసేవ, దేశాభివృద్ధి సహా ‘వికసిత్ భారత్–2047’ సంకల్పాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా ‘ఆశీర్వాద్ కా దియా’, ‘నమో సేవా గాథ’, ‘ఆంగన్ కా ఉత్సవ్’, ‘కహానీ బద్లావ్ కి’, ‘సేవా జ్యోతి యాత్ర’ వంటి వినూత్న ప్రజా భాగస్వామ్య సేవలను ప్రజల ముందుకు తీసుకురానున్నారు. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాల సమన్వయం, అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ బాధ్యతలను మంత్రి సత్యకుమార్ దగ్గరుండి చూడనున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి స్వల్ప అస్వస్థత.. ఇవాళ్టి కార్యక్రమాలు రద్దు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పల్ప అస్వస్థతకు...
By SivaNagendra Annapareddy 2025-12-24 06:44:49 0 349
Telangana
ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ఇంటిని ముట్టడించిన బీజేపీ నాయకులు
చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ లో...
By Avunoori Mahesh 2026-04-18 09:48:07 0 194
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇంటర్లో సత్తా చాటిన విద్యార్థులు
రోడ్డు ప్రమాదంలో మరణించినా.. ఇంటర్‌లో సత్తా చాటిన విద్యార్థులు   Apr 13, 2026, ...
By Rajini Kumari 2026-04-13 08:14:03 0 174
Andhra Pradesh
మదనపల్లె ఘటన.. ఘోరంగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు.
మదనపల్లెలోని రాగిమానిదిన్నెపల్లెలో కుమార్తె రిషిక ప్రియా మృతదేహాన్ని చూసి తల్లి తీవ్ర దుఃఖంలో...
By Pagadala Venkateswar 2026-02-18 07:07:05 0 208
Kerala
Kerala Tourism Growth Through Sustainable Policies
Kerala is advancing tourism development through sustainable policies that balance economic growth...
By Fathima Safa 2026-06-17 11:23:31 0 201
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com