నారాయణ గురుదేవుల బోధనలు ఆదర్శం.|

0
103

● సమానత్వం, మానవత్వం, సోదరభావానికి గురుదేవుల సందేశం

● ఓణం ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీక

● అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్ష

అల్వాల్, ఆగస్టు 30: వెంకటాపురం డివిజన్‌ ఖానాజిగూడ గ్రీన్‌ఫీల్డ్స్‌లో శ్రీ నారాయణ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 172వ శ్రీ నారాయణ గురుదేవుల జయంతి, ఓణం వేడుకలకు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గురుదేవుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే.. నిర్వాహకులు, కేరళ సోదర సోదరీమణులకు ఓణం పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

“ఒకే జాతి, ఒకే మతం, ఒకే దేవుడు – మానవునికి” అనే మహోన్నత సందేశంతో శ్రీ నారాయణ గురుదేవులు సమాజంలో సమానత్వం, మానవత్వం, సోదరభావం పెంపొందించేందుకు కృషి చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గం నేటి సమాజానికి కూడా స్ఫూర్తిదాయకమని అన్నారు.

కేరళ ప్రజలు అత్యంత పవిత్రంగా, ఆనందోత్సాహాలతో జరుపుకునే ఓణం పండుగ ఐక్యత, సౌభ్రాతృత్వం, సంతోషానికి ప్రతీకగా నిలుస్తుందని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గోకులం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ గోకులం గోపాలన్, శ్రీ నారాయణ విద్యా సంస్థల అధ్యక్షులు పి.బి. రాఘవేంద్ర నందన్, ప్రధాన కార్యదర్శి పద్మనాభన్, కల్చరల్ సెక్రటరీ హరిదాస్, అలెక్స్, రాఘవాచారి, కే.ఆర్. మనోజ్, సెంథిల్ కుమార్, వీరారెడ్డి, ఉదయ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ గౌడ్, శ్రీనివాసులు, సురేష్, జమీందార్, సంపత్, సోమయ్య, రాము, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రోడ్డు దగ్గర ధర్నా
DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, ఆదోని డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో...
By Boya Dasthagiri 2026-09-07 14:20:44 0 113
Andhra Pradesh
సుమన్ టి వి ప్రతినిధి జగదీష్ మృతి: మధుసూధన్ నాయుడు పరామర్శ
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, సరస్వతి పురం గ్రామానికి చెందిన సుమన్ టి వి ప్రతినిధి రామిశెట్టీ...
By Kothuru Murali 2026-03-02 12:36:50 0 186
Telangana
"రైల్వే స్టేషన్‌లో.. గంజాయి గుట్టురట్టు”
సికింద్రాబాద్ : దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో...
By Sidhu Maroju 2026-05-08 11:38:31 0 379
Andhra Pradesh
Sreelalitha: విజయవాడ గాయనిపై మోదీ ప్రశంస.. ప్రధాని పోస్ట్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు.
విజయవాడ గాయని శ్రీలలిత ఆలపించిన ఓ భక్తి గీతానికి అరుదైన గౌరవం దక్కింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన...
By Pagadala Venkateswar 2026-03-25 03:15:09 0 207
Telangana
ఆసిఫాబాద్‌లో ఘనంగా అంబలి పంపిణీ: సేవా స్ఫూర్తిని చాటుతున్న UBY ఫౌండేషన్
🎤ఆసిఫాబాద్, మే 24 (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో...
By Chunarkar Jagadeesh 2026-05-24 04:29:30 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com