ఆసిఫాబాద్‌లో ఘనంగా అంబలి పంపిణీ: సేవా స్ఫూర్తిని చాటుతున్న UBY ఫౌండేషన్

0
1K

🎤ఆసిఫాబాద్, మే 24 (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మండుతున్న ఎండల నేపథ్యంలో సామాన్య ప్రజలు, బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఒక గొప్ప మానవతా కార్యక్రమం శనివారం నాడు ఘనంగా ప్రారంభమైంది. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద UBY ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, UBY ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉబేద్ బిన్ యహియా (తారిఖ్) గారి పదేళ్ల అద్వితీయ సేవా నిరతిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ రోజుల్లో రూపాయి స్వార్థం లేకుండా పని చేసేవారే అరుదుగా ఉన్నారని, అలాంటిది గత 10 ఏళ్లుగా నిరంతరాయంగా ప్రజాసేవకే అంకితమవ్వడం తారిఖ్ గారి నిరుపమాన సేవా గుణానికి నిదర్శనమని కొనియాడారు.సమాజంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో, ప్రజాసేవలో ఆయన ఎప్పుడూ ముందుంటారని.. ఆయన పదేళ్ల సుదీర్ఘ సేవా ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.ఈ సేవా కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉబేద్ బిన్ యాహియా (తారిఖ్)  గారితో పాటు మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్ గారు సర్పంచ్ గంగారాం,నాయకులు కలేవార్ రాజేంద్ర ప్రసాద్ గారు,UBY ఫౌండేషన్ సభ్యులు మరియు  ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
3వ రోజు ఆట ల పోటీలు
 విశాఖ కలెక్టరేట్ లో గల ఎన్ జి ఓస్ ప్రాంగణం లో  మహిళ దినోత్సవం పురస్కంచుకొని అన్ని శాఖల...
By Mobbu Venkatramana 2026-03-09 10:31:54 0 297
Telangana
సుల్తానాబాద్ : ఎలిగేడు లో వడదెబ్బతో రైతు మృతి..!
ఎలిగేడు మండలంలోని లాలపల్లి గ్రామానికి చెందిన మల్లారెడ్డి వడదెబ్బతో మృతి చెందాడు. కుడుము సభ్యులు...
By Sunka Santhosh 2026-04-29 17:04:45 0 211
Andhra Pradesh
Chandrababu Naidu: నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-04-06 04:46:05 0 236
Andhra Pradesh
*జిఎంసి సంక్రాంతి సంబరాలతో సంతోషాలు నిండుగా*
🎋 *జిఎంసి సంక్రాంతి సంబరాలతో సంతోషాలు నిండుగా*  🎋 *ఈ నెల 11 నుండి ఎన్టీఆర్ స్టేడియంలో...
By John Baji 2026-01-11 05:08:58 0 228
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com