ప్రభుత్వ ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా.. టెక్నాలజీతోనే సేవలు: సీఎం చంద్రబాబు.

0
86

ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందాలని, ఇందుకోసం ఏఐ అసిస్టెంట్, బ్లాక్ చెయిన్ వంటి అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేని విధంగా పాలన ఉండాలని స్పష్టం చేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం పదేపదే వాటిని అప్‌లోడ్ చేసే పనిలేకుండా ‘డేటా ఇంటిగ్రేషన్’ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. సోమవారం సచివాలయంలో ఆర్టీజీఎస్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖలు తమ సమర్థతను పెంచుకుని, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

 

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. ఈసారి పంటల దిగుబడి సాధారణం కన్నా 20 శాతం తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. కృష్ణా డెల్టాకు సెప్టెంబర్ నెలాఖరు వరకు పట్టిసీమ ద్వారా నీరందించగలమని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం, ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు నీటి కొరత లేకుండా చూడాలన్నారు. సాగు ప్రారంభించని చోట్ల వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని ఆదేశించారు. రైతులకు పంపే క్రాప్ అలర్ట్‌లపై తీసుకుంటున్న చర్యలను కూడా పర్యవేక్షించాలని, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని స్పష్టం చేశారు

Search
Categories
Read More
Andhra Pradesh
లోకేష్ సార్ మా పాఠశాలను కాపాడండి.
లోకేశ్‌ సర్‌... మా పాఠశాలను కాపాడండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు...
By Pagadala Venkateswar 2026-02-14 12:46:04 0 257
Andhra Pradesh
కూల్చివేత యత్నంతో జన్మభూమి కాలనీలో ఉద్రిక్తత.
మదనపల్లి నీరుగట్టువారిపల్లె జన్మభూమి కాలనీలో శనివారం ఉదయం వాసుదేవ ఇంటి వద్ద ప్రహరీ గోడ కూల్చివేత...
By Pagadala Venkateswar 2026-05-16 05:01:55 0 119
Andhra Pradesh
మహిళల సొమ్ము దారి మళ్లిస్తే జైలుకే: పల్నాడు కలెక్టర్
పల్నాడు జిల్లాలో డ్వాక్రా,మెప్మా స్వయం సహాయక సంఘాల నిధుల గోల్మాల్పై కలెక్టర్ కృతికా శుక్లా...
By John Baji 2026-01-03 02:15:10 0 240
Telangana
ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ఇంటిని ముట్టడించిన బీజేపీ నాయకులు
చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ లో...
By Avunoori Mahesh 2026-04-18 09:48:07 0 196
Telangana
వైరల్ స్క్రీన్‌షాట్‌పై ఎమ్మెల్యే వివరణ.|
● సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడి ● నకిలీ స్క్రీన్‌షాట్‌ను...
By Sidhu Maroju 2026-09-16 19:04:49 0 80
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com