కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
Posted 2026-08-24 23:57:59
0
326
🎤కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం అర్హులైన ఉపాధ్యాయుల నుండి దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా రంగంలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను ఈ అవార్డుల కోసం ఎంపిక చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా GHM-Gr-II, SA, మరియు SGT విభాగాల నుండి అత్యుత్తమ సేవలు అందించిన ముగ్గురు ఉపాధ్యాయులను ఎంపిక చేయనున్నారు. అర్హత మరియు ఆసక్తి గల ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను ఆగస్టు 27వ తేదీ లోపు సంబంధిత ఎంఈఓ (MEO) ఆఫీసులలో అందజేయాలని సూచించారు. అయితే గతంలో ఈ అవార్డులు పొందిన వారికి ఈసారి దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఎంపికైన ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రదానం చేయనున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నమయ్య జిల్లా : Nimmanapalle: నిమ్మనపల్లి మండలం చల్లావారిపల్లి అక్కదేవతల ఆలయంలో గ్రామస్థులు శుక్రవారం 'పచ్చ పోసే' మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
నిమ్మనపల్లి: మండలంలోని చల్లావారిపల్లి గ్రామంలో చమరకాకి ఒడ్డున కొలువైన అక్కదేవతల ఆలయంలో...
డ్వాక్రా మహిళలు ఎగిరి గంతేసే వార్త.. చంద్రబాబు సంక్రాంతి తీపికబురు..
DWCRA Women Online Loans: రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది....
పదో తరగతి ఫలితాల్లో దుగ్గొండి రికార్డ్....
భారత్ అవాజ్ న్యూస్: దుగ్గొండి : పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో దుగ్గొండి మండలం అద్భుత...
మచ్చబొల్లారంలో మిలాద్ వేడుకలు.|
● ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
● మహమ్మద్ ప్రవక్త సందేశాలను గుర్తుచేసిన...
పుంగనూరులో కృష్ణ జలాలతో పుణ్యమ్మకు ఘనంగా మరవ విడుదల
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో హంద్రీనీవా రివర్ ద్వారా కృష్ణ జలాలు పుంగమ్మ చెరువుకు చేరాయి....