Madanapalle: మదనపల్లె రెడ్డీస్ కాలనీలో 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం - ప్రజా సమస్యలు తెలుసుకున్న 32వ వార్డు ఇన్‌చార్జ్ మధుసూదన్ రెడ్డి!

0
148

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని రెడ్డీస్ కాలనీలో 32వ వార్డు ఇన్‌చార్జ్ మండిపల్లి (జెసిబి) మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మండిపల్లి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు.

 

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆయన సూచించారు.

 

ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
కొడంగల్మ నియోజకవర్గం మద్దూర్ లో మిన్నంటిన 'పసుపు' పండగ
కొడంగల్రి నియోజకవర్గం మద్దూర్ మండల రిపోర్టర్    సూర్యమోహన్    మద్దూరులో...
By Vanmoj Suryamohan 2026-03-30 03:39:22 0 469
Telangana
ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు ఈ మౌనం ?
ఏంటి Kalvakuntla Kavitha అక్కో  ‎తెలంగాణకి అమ్మ అవుతా అన్నావ్  ‎ఒక కూతురు...
By Ponnala Srinivasrao 2026-05-10 02:06:17 0 148
Andhra Pradesh
Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం.
ఈ నెల 8 నుంచి 18 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సీఎం చంద్రబాబును ఆహ్వానించిన...
By Pagadala Venkateswar 2026-02-07 09:48:29 0 221
Andaman & Nikobar Islands
India and Japan Push Forward 'Smart Island' Plan for Andaman & Nicoba
In early June, India and Japan strengthened their partnership to develop the Andaman &...
By Bharat Aawaz 2025-07-17 08:37:30 0 1K
Andhra Pradesh
క్వాంటం టాక్ బై CM
• ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం •...
By Rajini Kumari 2025-12-23 09:45:45 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com