గూడూరు బస్టాండ్ సర్కిల్ నందు 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని ధర్నా... కార్మికుల ను విస్మరిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పతనం ఖాయమని హెచ్చరిక,..,(సీఐటీయూ)

0
1K

మే డే స్ఫూర్తితో పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని కోరుతూ గూడూరులో సిఐటియు ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో సిఐటియు నాయకులు దానం ఉన్న అధ్యక్షతన కార్మికులతో " " ధర్నా " కార్యక్రమం

నిర్వహించడం జరిగింది. ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు డివిజన్ కార్యదర్శి జే,మోహన్ మాట్లాడుతూ అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని కోరుతూ లక్షలాదిమంది కార్మికులు రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తుంటే అక్కడ ఉన్న ప్రభుత్వం పెట్టుబడిదారులకు కార్పెంట సంస్థలకు అనుకూలంగా వ్యవహరించి వేలాది మంది కార్మికులను బలిగొందని ఆ నెత్తుటి మరకలు నుంచి పుట్టిన ఎర్రజెండా నాటి నుండి నేటి వరకు ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని పోరాటం చేయడం జరుగుతుందని బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న ఎనిమిది గంటల పని విధానాన్ని మోడీ ప్రభుత్వం గత 11 సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారులకు కార్పొరేటర్ సంస్థలకు ఊడిగం చేయడం కోసం కార్మికుల పైన కక్షగట్టి ఎనిమిది గంటలకు పైగా 10,12,నుండి 14 గంటల వరకు పనులు చేయాల్సిందే అని నిర్ణయం చేయడం చాలా దుర్మార్గమని, కార్మికులను రోబోలుగా చూస్తున్నారు. 

కానీ కార్మికుల ఆరోగ్య పరిస్థితులను అర్థం చేసుకోవడంలేదని, కేవలం లాభార్జన ధ్యేయంగా పనిచేస్తున్న కార్పొరేటు పెట్టుబడిదారుల సంస్థలకు ప్రభుత్వాలు వత్తాసు పలకడం కార్మికులను నాశనం చేయడం, నయా బానిసలుగా చేయడం కోసమే అని అన్నారు,

 మోడీ ప్రభుత్వం చెప్పిందే తడవుగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ ఆపై 12 నుండి 14 గంటలు పని చేయాలి అని రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని వెంటనే కేబినెట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు. ఇప్పటికైనా కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన ప్రభుత్వమే కార్మికులను రోబోలుగా తయారు చేసే దుర్మార్గమైన విధానాలను మానుకోవాలని లేకుంటే దేశవ్యాప్తంగా జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు*కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాగేష్, మునప్ప, కొమ్మురాజు, హమాలి సంఘం అధ్యక్షుడు కృపానందం, చిరంజీవి,కార్మికులు సుధాకర్, ప్రభుదాస్, జైలు, నవీన్, ప్రదీప్, మరియు హమాలి కార్మికులు పాల్గొన్నారు

Like
1
Search
Categories
Read More
Telangana
అక్టోబర్ 14-16: ములుగు జిల్లాలో మళ్లీ వానల హోరు |
ఈ రోజు సాయంత్రం నుండి రాత్రివరకు భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, ములుగు జిల్లాల్లో ప్రకటమైన ఇది...
By Bhuvaneswari Shanaga 2025-10-11 05:44:33 0 41
International
భారత స్పేస్ స్టేషన్ 2035కి సిద్ధమవుతోంది! |
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2035 నాటికి దేశీయ స్పేస్ స్టేషన్ నిర్మాణాన్ని లక్ష్యంగా...
By Deepika Doku 2025-10-17 08:30:43 0 53
Entertainment
కాంతారా చాప్టర్ 1.. ఓటీటీలో divine రాబోతుంది |
అక్టోబర్ 2, 2025న థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని సాధించిన ‘కాంతారా: చాప్టర్ 1’...
By Akhil Midde 2025-10-27 10:25:47 0 24
Karnataka
Language Row in Karnataka: SBI Officer Refuses to Speak Kannada, Sparks Outrage
Language Row in Karnataka: SBI Officer Refuses to Speak Kannada, Sparks Outrage A video showing...
By BMA ADMIN 2025-05-21 08:41:26 0 2K
Telangana
పేకాటరాయుళ్ల అరెస్ట్
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైకేల్ సెయింట్ మైకేల్ స్కూల్ సమీపంలో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు...
By Sidhu Maroju 2025-06-06 16:10:13 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com