భూపాలపల్లి జిల్లా రేగొండ లో భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టివేత
పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ చేసిన 444.75 క్వింటాళ్ల బియ్యాన్ని భూపాలపల్లి పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ భాస్కర్ల రాజు రేగొండ మండల కేంద్రంలో గల పాత రైస్ మిల్ గోదాములో తనిఖీలు నిర్వహించగా భారీ ఎత్తున PDS బియ్యం బస్తాలు గుర్తించారు.ఇట్టి సమాచారాన్ని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మరియు జిల్లా మేనేజర్ కు తెలియపరచగా ,వారు సంఘటన స్థలాన్ని పరిశీలించి లభ్యమైన మొత్తం బియ్యం PDS బియ్యంమే అని ప్రాథమికంగా నిర్ధారించారు. తదుపరి బియ్యం బస్తాలను లెక్కించి పంచనామా నిర్వహించి సుమారు 444.75 క్వింటాళ్ల బియ్యంగా నిర్ధారణ చేసారు.ఇట్టి బియ్యాన్ని అధికారికంగా స్వాధీనం చేసుకుని ఉన్నతాధికారుల ఆదేశం మేరకు సమీపంలో గల మారుతి రైస్ మిల్ లో భద్రపరిచినట్టు అధికారులు పేర్కొన్నారు.ఇట్టి బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన పాత రైస్ మిల్ యజమాని శ్రీనివాస్ మరియు వాహన డ్రైవర్లు తూర్పాటి శ్రీనివాస్, సాంబశివుడు పై కేసు నమోదు చేసి దర్యాప్తు నిమిత్తం పోలీసులకు అప్పగించారు.
ఇంత భారీ స్థాయిలో రేషన్‌బియ్యం పట్టుబడటంతో దీని వెనుక ఉన్న సరఫరా దారులు, బియ్యం ఎక్కడి నుంచి సేకరించారు,ఎక్కడికి తరలిస్తున్నారు ఎవరికి చేరవేస్తున్నారో అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు, ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం చట్టరీత్యా నేరమని అధికారులు తెలిపారు.ఈ దాడులలో DSO కిరణ్, జిల్లా మేనేజర్ రాములు, సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ భాస్కర్ల రాజు, టెక్నికల్ అసిస్టెంట్ రాహుల్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz