నాపై చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటా: ఎంపీ. ఈటెల

0
1K

సికింద్రాబాద్..కాళేశ్వరం కమిషన్ విషయంలో తనపై బురద చల్లడం సరికాదని,తనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.కాళేశ్వరం లో అవినీతి జరిగిందనే అంశంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అప్పటి మంత్రివర్గ ఉప సంఘం లో తనతో పాటు మరో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారని వారికి అన్ని వాస్తవాలు తెలుసని అన్నారు.బనకచర్ల పై ఆనాడే తాను మాట్లాడానని ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ లో కొట్లాడిందే తానని తెలిపారు.కాలేశ్వరం కమిషన్ విచారణ త్వరగా పూర్తి చేస్తారన్న నమ్మకం తమకు లేదని,రిపోర్ట్ ఇస్తారనేది కూడా లేదన్నారు.వెంటనే సిబిఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. దమ్ముంటే విచారణ ముగిసిన అనంతరం వచ్చే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో భాజాపా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదని, అవినీతి జరిగితే కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. కాలేశ్వరం కేసీఆర్ నిర్మించింది కాదని జల యజ్ఞంలో భాగంగా ప్రాణహిత చేవెళ్లను రీడిజైన్ చేశారని అందులో 3 బ్యారేజీలు మాత్రమే కొత్తగా నిర్మించాలని వెల్లడించారు. ఈనెల 22 న 11 సంవత్సరాల భాజాప పాలనపై ఛాయాచిత్ర ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ హాజరుకానున్నట్లు తెలిపారు. 

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
TTD: తిరుమల వెళ్లకుండానే శ్రీవారి డాలర్లు.. దేశవ్యాప్తంగా భక్తులకు అందుబాటులోకి!
శ్రీవారి బంగారు, వెండి డాలర్లను ఆన్‌లైన్‌లో విక్రయించనున్న టీటీడీ దేశవ్యాప్తంగా...
By Pagadala Venkateswar 2026-03-11 03:26:53 0 199
SURAKSHA
Breaking Barriers: Arunachal's First Woman IPS Officer
How Tenzin Yangki Wrote History from Tawang to the National Police Service "Being first is never...
By Kalaga Sailaja 2026-07-30 08:49:40 0 365
BMA
Counter-Memes: The New Language of Civic Resistance
While political establishments use memes for propaganda, Indian youth are utilizing them for...
By JoinBMA 2026-08-21 18:41:04 0 357
Telangana
పచ్చదనమే ప్రగతి.. విద్యార్థులే స్ఫూర్తి.|
● విద్యార్థులే పర్యావరణ పరిరక్షణకు రాయబారులు కావాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ● ప్రతి...
By Sidhu Maroju 2026-07-29 08:20:22 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com