బీజేపీ కొత్త టీమ్‌లో తెలంగాణకు నో ప్లేస్.|

0
150

● గతంలో తెలంగాణకు మూడు కీలక హోదాలు.. ఇప్పుడు ఒక్కరికీ అవకాశం లేదు

● బండి సంజయ్, డీకే అరుణ, కే. లక్ష్మణ్‌లకు గతంలో జాతీయ బాధ్యతలు

● ఏపీకి రెండు కీలక పదవులు.. పురంధేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు

హైదరాబాద్, ఆగస్టు 17: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు.

ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో పాటు వివిధ మోర్చాలు, మీడియా, సోషల్ మీడియా విభాగాలకు సంబంధించిన కీలక నియామకాలను వెల్లడించారు.

తాజా జాబితాలో తెలంగాణకు చెందిన ఒక్క నాయకుడికీ జాతీయ స్థాయి ఆఫీస్ బేరర్ హోదా దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది.

13 మంది ఉపాధ్యక్షుల జాబితాలో తెలంగాణకు చోటు దక్కలేదు.

ఎనిమిది మంది ప్రధాన కార్యదర్శులు, 16 మంది కార్యదర్శుల జాబితాలోనూ రాష్ట్రానికి ప్రాతినిధ్యం కనిపించలేదు. 

పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్)గా బీఎల్ సంతోష్‌ను కొనసాగించారు. శివప్రకాశ్, సౌదాన్ సింగ్‌లకు సంయుక్త ప్రధాన కార్యదర్శులు (ఆర్గనైజేషన్)గా బాధ్యతలు అప్పగించారు.

ఉపాధ్యక్షులుగా వసుంధర రాజే సింధియా, తిరత్ సింగ్ రావత్, రామ్ మాధవ్, బైజయంత్ జయ్ పాండా, డి. పురంధేశ్వరి, రేఖా వర్మ, వర్షాబెన్ నరేంద్రభాయ్ దోషి, డా. భారతి ప్రవీణ్ పవార్, మన్‌ప్రీత్ సింగ్ బాదల్, లాల్ సింగ్ ఆర్య, ప్రొఫెసర్ ఎం. నాగరాజ, ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్, డా. మధుచంద్ర కర్‌లను నియమించారు.

పార్టీకి చెందిన ఏడు ప్రధాన మోర్చాల అధ్యక్షుల జాబితాలోనూ తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కలేదు.

యువ మోర్చాకు డా. హేమంగ్ జోషి, మహిళా మోర్చాకు రూప్ కుమారి చౌదరి, ఓబీసీ మోర్చాకు అమర్‌పాల్ మౌర్య, కిసాన్ మోర్చాకు బన్సీలాల్ గుజ్జర్, ఎస్సీ మోర్చాకు శివేశ్ కుమార్ రామ్, ఎస్టీ మోర్చాకు డా. మన్నాలాల్ రావత్, మైనారిటీ మోర్చాకు కున్వర్ బాసిత్ అలీలను నియమించారు.

మీడియా విభాగం కన్వీనర్‌గా అనిల్ బలూనీ, కో-కన్వీనర్లుగా ఆశిష్ ఉషా అగర్వాల్, ప్రదీప్ భండారీ, సిద్ధార్థ్ యాదవ్‌లకు బాధ్యతలు అప్పగించారు. 

సోషల్ మీడియా కన్వీనర్‌గా దీపక్ మాస్కే, కో-కన్వీనర్లుగా ప్రీతి గాంధీ, శివానంద్ ద్వివేది, అలోక్ భట్, అరుణ్ యాదవ్‌లను నియమించారు. ఈ రెండు విభాగాల్లోనూ తెలంగాణకు చోటు లభించలేదు.

ఇదిలా ఉండగా, గతంలో తెలంగాణ బీజేపీకి జాతీయ స్థాయిలో మూడు కీలక హోదాలు ఉన్నాయి. 

2023లో బండి సంజయ్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించగా, డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగారు. అదే సమయంలో కే. లక్ష్మణ్ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించారు.

అయితే తాజాగా ప్రకటించిన జాబితాలో తెలంగాణ నుంచి ఒక్క నాయకుడికీ జాతీయ స్థాయి ఆఫీస్ బేరర్ హోదా దక్కలేదు. 

గతంలో రాష్ట్రానికి లభించిన మూడు కీలక బాధ్యతలకు భిన్నంగా ఇప్పుడు ఎలాంటి ప్రాతినిధ్యం లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు రెండు కీలక అవకాశాలు లభించాయి.

ఉపాధ్యక్షుల జాబితాలో డి. పురంధేశ్వరికి స్థానం కల్పించగా, ఆల్ సెల్స్ జాయింట్ కోఆర్డినేటర్‌గా విష్ణువర్ధన్ రెడ్డికి బాధ్యతలు దక్కాయి. దీంతో కొత్త టీమ్‌లో తెలుగు రాష్ట్రాలకు లభించిన ప్రాతినిధ్యంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పలు ప్రాంతాలలో పరిశీలన చేసిన డిప్యూటీ ఎంపీడీవో
శనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ పలు ప్రాంతాలలో...
By Kothuru Murali 2026-03-29 07:24:25 0 331
Entertainment
Renowned Assamese Singer Gayatri Hazarika Passes Away at 44, Tributes Pour In
Renowned Assamese Singer Gayatri Hazarika Passes Away at 44, Tributes Pour In The Assamese music...
By BMA ADMIN 2025-05-21 13:37:06 0 2K
Telangana
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క. జోడేఘాట్‌లో అమరవీరుడు కొమురం భీం విగ్రహానికి ఘన నివాళులు. పలు గ్రామాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ సర్‌ SSR ప్రక్రియపై క్షేత్రస్థాయి సమీక్ష.
కుమురంభీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: జల్-జంగల్-జమీన్ హక్కుల కోసం పోరాడి...
By Chunarkar Jagadeesh 2026-07-21 15:06:36 0 253
Andhra Pradesh
రొంపిచర్ల: మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
రొంపిచర్ల AP మోడల్ స్కూల్లో 2026-27లో ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు...
By Kothuru Murali 2026-02-21 08:29:11 0 193
Andhra Pradesh
ఎమ్మిగనూరులో బివి నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు కోఆపరేటివ్ స్టోర్స్ ఆధ్వర్యంలో దుకాణాల నిర్మాణానికి భూమి పూజలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ...
By Boya Dasthagiri 2026-04-22 09:50:56 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com