అమ్మవారి సేవలో భక్తజనం.. బోనాల పండుగ సందడి.|

0
126

● అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్న ఎంపీ

● అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈటల రాజేందర్

● భక్తిశ్రద్ధలతో కొనసాగిన బోనాల వేడుకలు

మేడ్చల్  మల్కాజ్‌గిరి, ఆగస్టు 15: మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని బొల్లారంలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారని పేర్కొంటూ, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో బొల్లారం ప్రాంతంలో పండుగ సందడి నెలకొంది. సంప్రదాయబద్ధంగా సాగిన ఫలహారం బండి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల మాణిక్యరెడ్డి, సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి, సుధీర్, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: జాతీయలోక్అధలత్ల్5,662 కేసుల పరిశ్కారం
గథానెలరోజుల నుండి నిర్వాహిస్తునా జాతీయలోక్ అధలత్లోభాగంగా జిల్లా వ్యాప్తంగ వివిధా పోలీసు స్టెషాన్...
By Sadaq Sadaq 2026-03-29 17:46:07 0 216
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:చౌడేపల్లి గంగమ్మ జాతర: భక్తుల రాకకు భారీ ఏర్పాట్లు
ఏప్రిల్ 7, 8 తేదీల్లో చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని చౌడేపల్లిలో గంగమ్మ జాతర ఘనంగా...
By Kothuru Murali 2026-03-28 06:05:06 0 199
Telangana
Ivvaltnunchi bonalu
గోల్కొండ కోటపై శ్రీ జగదాంబ మహంకాళి అమ్మ వారికి తొలి బోనం సమర్పణతో ఆషాఢమాస ఆధ్యాత్మిక మహోత్సవాలు...
By G k Nookala 2026-07-16 01:29:49 0 137
Andhra Pradesh
Chandrababu Naidu: విజయవాడలో ఉన్నామా, తిరుపతిలో ఉన్నామా అన్నంత సంతోషంగా ఉంది: సీఎం చంద్రబాబు.
        Chandrababu Naidu: విజయవాడలో ఉన్నామా, తిరుపతిలో ఉన్నామా అన్నంత...
By Pagadala Venkateswar 2026-01-19 16:57:50 0 205
Andhra Pradesh
సంకిలి చక్కెర పరిశ్రమను కాపాడాలి
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల చెరకు రైతులకు ఆధారమైన సంకిలి చక్కెర పరిశ్రమను కాపాడుకునేందుకు...
By Boiena Rajesh 2026-09-04 11:34:15 0 79
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com