చింతూరులోనే వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాలి!

0
164

చింతూరు సబ్‌డివిజన్ పరిధిలో నిలిచిపోయిన వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలను వెంటనే పునరుద్ధరించాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆటో యూనియన్ సభ్యులు ఎంవిఐ చల్లారావును కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ... చింతూరులో ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించకపోవడంతో నాలుగు మండలాలకు చెందిన ఆటో కార్మికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కోసం దాదాపు 280 కిలోమీటర్లు ప్రయాణించి రాజమండ్రి వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. దీనివల్ల అదనపు ఇంధన ఖర్చులతో పాటు రోజంతా సమయం వృథా అయి ఉపాధి కోల్పోతున్నామని వాపోయారు. ఏజెన్సీ ప్రాంతంలోని వాహనదారుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, గతంలో మాదిరిగానే చింతూరు సబ్‌డివిజన్‌లోనే క్రమం తప్పకుండా ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వారు ప్రజాప్రతినిధులను, సంబంధిత రవాణా శాఖ ఎంవిఐ మరియు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు, స్థానిక వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
SURAKSHA
Harmeet Singh IPS: Leading Assam Police with Vision and Integrity
A distinguished 1992-batch IPS officer whose decades of service, strategic leadership, and...
By Kalaga Sailaja 2026-07-23 09:39:17 0 162
Telangana
అల్వాల్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ - పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ మండల రెవెన్యూ అధికారి (MRO) కార్యాలయంలో ఈరోజు కళ్యాణ లక్ష్మీ...
By Sidhu Maroju 2026-03-12 08:01:10 0 193
Andhra Pradesh
Amaravathi city
  అమ‌రావ‌తికి మ‌రో 'గుర్తింపు'!   ఏపీ రాజ‌ధాని...
By G k Nookala 2026-04-05 13:43:14 0 242
SURAKSHA
Shri Satinder Pal Singh, IPS: Guardian of Justice
A distinguished 1995-batch IPS officer of the Himachal Pradesh cadre whose exemplary leadership,...
By Lokeshwari Panthadi 2026-07-20 06:41:29 0 166
Andhra Pradesh
ప్రముఖ పద్యకవి చదలవాడ లక్ష్మీనరసింహారావు కన్నుమూత.
ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ పద్యకవి, 'పద్యభారతి' బిరుదాంకితులు చదలవాడ లక్ష్మీనరసింహారావు (90)...
By Pagadala Venkateswar 2026-04-13 05:54:58 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com