అల్వాల్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ - పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|

0
166

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ మండల రెవెన్యూ అధికారి (MRO) కార్యాలయంలో ఈరోజు కళ్యాణ లక్ష్మీ పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థికంగా అండగా నిలవాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి అర్హుడికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రాములు,  తెలంగాణ రాష్ట్ర ఎంబీసి (MBC) కార్పొరేషన్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్  పాల్గొన్నారు.

నందికంటి శ్రీధర్  మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో మల్కాజిగిరి నియోజకవర్గం ముందుంటుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్ గౌడ్ స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమకు ఆర్థిక వెసులుబాటు కల్పించినందుకు లబ్ధిదారులు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
A p new map with capital amaravathi
*అమరావతితో ఆంధ్రప్రదేశ్‌ కొత్త మ్యాప్.28 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌ను ఏపీ డిజాస్టర్...
By G k Nookala 2026-04-05 03:16:18 0 228
Telangana
ఆసిఫాబాద్‌లో ఈ నెల 22న మినీ జాబ్ మేళా జిల్లా ఉపాధి అధికారి కిరణ్ కుమార్
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):కుమారం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి...
By Chunarkar Jagadeesh 2026-07-20 14:42:43 0 85
SURAKSHA
Dr. Sachin Shinde: Driving Progressive Island Governance
A distinguished 2008-batch AGMUT cadre IAS officer and medical doctor by training, Dr. Sachin...
By Lokeshwari Panthadi 2026-07-24 04:54:40 0 28
Business & Finance
PAN Card Services for Fast and Easy Registration
PAN Card Services help individuals and businesses apply for a new Permanent Account Number (PAN),...
By Navya Sree 2026-07-21 06:29:27 0 48
Business & Finance
Ignoring ISO Standards Can Harm Your Business Growth
Ignoring ISO standards can reduce customer trust, limit business opportunities, and affect...
By Navya Sree 2026-07-11 06:54:59 0 50
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com