మారకద్రవ్యాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.

0
1K

సికింద్రాబాద్.. నగరంలోని పలు ప్రాంతాలలో అక్రమంగా హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాను ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి ఆరు లక్షల 50 వేల విలువైన హాష్ ఆయిల్, గంజాయి,చరాస్, రెండు కత్తులు, మూడు ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపారు. మాసబ్ ట్యాంక్ కు చెందిన మహమ్మద్ పైజాన్ కీలక సూత్రధారి కాగా ,నవ్య అనే మహిళ శ్రీకాకుళం నుండి హష్ ఆయిల్ ను తీసుకువచ్చి విజయ్ కుమార్ ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలలో యువతను విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై సంచరిస్తున్న వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారి వద్ద హాష్ ఆయిల్ లభించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై గతంలో కూడా ఎన్ డి పి ఎస్ చట్టం కింద కేసులు నమోదైనట్లు నేర ప్రవృత్తి కలిగి ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ఈ ముఠాకు సంబంధించి అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు వారి నుండి మరింత సమాచారం రావాల్సి ఉందని పేర్కొన్నారు. యువత విద్యార్థులు మాదకద్రవ్యాల కు బానిసలు కాకుండా జాగ్రత్త పాటించాలని ఆయన సూచించారు.

Search
Categories
Read More
Telangana
ప్రక్షాళనలో భాగంగా 106 ఇరిగేషన్ అధికారులు బదిలీ |
తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. శాఖలో పారదర్శకత, సమర్థత పెంచే...
By Bhuvaneswari Shanaga 2025-10-15 07:19:56 0 20
Telangana
హైదరాబాద్‌లో రూ.50 వేలకుపైగా నగదు సీజ్‌ హెచ్చరిక |
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో, హైదరాబాద్ నగరంలో రూ.50 వేలకుపైగా నగదు రవాణా చేస్తే...
By Bhuvaneswari Shanaga 2025-10-07 11:39:09 0 24
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com