మారకద్రవ్యాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.

0
1K

సికింద్రాబాద్.. నగరంలోని పలు ప్రాంతాలలో అక్రమంగా హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాను ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి ఆరు లక్షల 50 వేల విలువైన హాష్ ఆయిల్, గంజాయి,చరాస్, రెండు కత్తులు, మూడు ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపారు. మాసబ్ ట్యాంక్ కు చెందిన మహమ్మద్ పైజాన్ కీలక సూత్రధారి కాగా ,నవ్య అనే మహిళ శ్రీకాకుళం నుండి హష్ ఆయిల్ ను తీసుకువచ్చి విజయ్ కుమార్ ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలలో యువతను విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై సంచరిస్తున్న వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారి వద్ద హాష్ ఆయిల్ లభించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై గతంలో కూడా ఎన్ డి పి ఎస్ చట్టం కింద కేసులు నమోదైనట్లు నేర ప్రవృత్తి కలిగి ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ఈ ముఠాకు సంబంధించి అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు వారి నుండి మరింత సమాచారం రావాల్సి ఉందని పేర్కొన్నారు. యువత విద్యార్థులు మాదకద్రవ్యాల కు బానిసలు కాకుండా జాగ్రత్త పాటించాలని ఆయన సూచించారు.

Search
Categories
Read More
Telangana
పౌర హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించిన: శరణగిరి దుంపల
అల్వాల్, వెంకటాపురం కొత్తబస్తీ లోని అంబేద్కర్ కమిటీ హాల్ లో పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమం...
By Sidhu Maroju 2025-07-01 08:08:46 0 981
Ladakh
"Ladakh Eyes Tourism & Winter Sports Growth" |
Ladakh is charting a strong vision to become a premier hub for tourism and winter sports, backed...
By Bhuvaneswari Shanaga 2025-09-22 09:44:25 0 89
Andhra Pradesh
వైద్య విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి 'ఈజ్' : 3,000 మందికి శిక్షణ |
రాష్ట్ర ఆరోగ్య శాఖ వైద్య విద్యార్థులలో మానసిక ఒత్తిడిని, సమస్యలను పరిష్కరించేందుకు 'ప్రాజెక్ట్...
By Meghana Kallam 2025-10-11 08:22:51 0 66
Bharat Aawaz
మోక్షగుండం విశ్వేశ్వరయ్య – తిరుపతి ఘాట్ రోడ్డుకు రూపకర్త!
ఇంజినీరింగ్ గొప్పతనానికి ప్రతీక – భక్తి పథానికి బలమైన మార్గదర్శి! సర్ మోక్షగుండం...
By Your Story -Unsung Heroes of INDIA 2025-08-05 11:25:20 0 774
Telangana
హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై వాయిదా కలకలం |
తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై జరుగుతున్న విచారణ అక్టోబర్ 9కి వాయిదా పడింది. ట్రిపుల్...
By Bhuvaneswari Shanaga 2025-10-08 12:37:12 0 27
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com