అరుణక్క నగర్‌కు కొత్త 100 KVA ట్రాన్స్‌ఫార్మర్

0
158

మంచిర్యాల: 8వ డివిజన్ కార్పొరేషన్ పరిధిలోని అరుణక్క నగర్‌లో విద్యుత్ సరఫరా తక్కువగా ఉండటంతో స్థానిక ప్రజలు కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ లో-వోల్టేజ్ సమస్యతో ఇళ్లలో విద్యుత్ పరికరాలు సరిగా పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు,ఈ సమస్యను స్థానిక యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిని రాజేష్ స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకెళ్లారు. అరుణక్క నగర్ ప్రజల ఇబ్బందులను వివరించి, విద్యుత్ సరఫరా మెరుగుపడేలా 100 KVA సామర్థ్యం గల కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరారు,ప్రజల సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి, అరుణక్క నగర్‌లో 100 KVA కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయించారు. దీంతో విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు,తమ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన భీమిని రాజేష్‌కు, సమస్యపై స్పందించి కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు అరుణక్క నగర్ స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని భీమిని రాజేష్ తెలిపారు.

Search
Categories
Read More
Telangana
ఘనంగా ప్రధానమంత్రి జయంతి వేడుకలు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఆయన...
By Sidhu Maroju 2025-09-17 15:47:17 0 318
SURAKSHA
WB Ex-Cops: Empowering Women After Retirement Duty
WB police officers work for women empowerment across Bengal. Self-help groups get guidance on...
By Kalaga Sailaja 2026-07-03 13:20:41 0 140
Andhra Pradesh
దివ్యాంగ శక్తి పథకమును ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు రాయచోటి బస్టాండ్ నందు దివ్యాంగ శక్తి పథకమును లాంఛనంగా ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి...
By Benguluri Madhubabu 2026-03-18 09:57:58 0 259
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, భీమగానిపల్లి వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది....
By Kothuru Murali 2026-05-04 13:23:22 0 173
SURAKSHA
P. K. Madhu, IPS: A Lifetime of Courage and Leadership
The Journey begins "The true strength of policing lies in protecting the...
By Fathima Safa 2026-07-16 12:08:01 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com