మాజీ ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు మానుకోవాలి

0
156

చలివాగు వాగు ఆయకట్ట రైతులతో సమావేశం నిర్ణయించి రైతుల సూచన మీరకే నిర్ణయాలు జరుగుతాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చి రెడ్డి అన్నారు. శాయంపేట మండలంలోని చలివాగు ప్రాజెక్టు తూము, నీటి మట్టాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బుచ్చి రెడ్డి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు ప్రతిపక్ష నాయకుల కుట్రలో బలి కావద్దని, తాగునీటికి ప్రాధాన్యత అనంతరం సాగునీటి ఆలోచనలో ప్రభుత్వం ఉందని అన్నారు. ఎల్నీనో ప్రభావం ప్రపంచమంతా ఉంటే రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి గారు వ్యాఖ్యానించడం వారి అవివేకం అన్నారు. రైతులతో రాజకీయం చేయకుండా చిత్తశుద్ధి ఉంటే చలివాగు ప్రాజెక్ట్ ఆయకట్టులో వారికి ఉన్న భూమిని సాగు చేయకుండా పేద రైతులకు నీరు పారే విధంగా క్రాప్ హాలిడే ప్రకటించుకోవాలని డిమాండ్ చేశారు. చలి వాగు గేట్లు తానే ఎత్తుతానని రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కు ఆ హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు. మినిమం లెవెల్స్ మెయింటైన్ చేయాలని ఈమధ్య కాలంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేస్తే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహకారంతో లిఫ్టింగ్ నిలిపివేయగా ప్రస్తుతం 14 ఫీట్ల నీరు ఉందని గుర్తు చేశారు. లేకుంటే ప్రాజెక్ట్ డేడ్ స్టోరేజ్ కి చేరేదని అన్నారు. ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారని, పంటలు వేశాక నీరు అందకపోతే భారీగా నష్టం జరిగే అవకాశం ఉన్నందున రైతులను ఆరుతడి పంటల వైపు మళ్ళించాలని ప్రయత్నాలు చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికే పంటలు వేసిన రైతులకు సాగునీరు తప్పకుండా ఇస్తారని, కొంత ఆయకట్టు రైతులతో మాట్లాడి క్రాప్ హాలిడే ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే అనధికారికంగా సాగునీరు పారుతుందని అన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు ఈ కార్యక్రమంలో చలి వాగు ఆయకట్టు రైతులు ,సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
NZB: ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల  బలూరా హాస్పిటల్ (బీ). వార్డెన్ యo...
By Sadaq Sadaq 2026-02-09 10:14:23 0 223
Telangana
"వాసవీ జయంతికి సెలవు: సీఎంలకు కైలాష్ రాంచెందర్ గుప్త ధన్యవాదాలు.|
హైదరాబాద్ : వాసవీ మాత ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక...
By Sidhu Maroju 2026-04-30 05:47:30 0 536
Telangana
చెత్త కుప్పలు.. ప్రజలకు తిప్పలు..|
● జవహర్‌నగర్ డంప్‌యార్డ్‌కు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరిన ఈటల...
By Sidhu Maroju 2026-08-05 09:26:29 0 143
Andhra Pradesh
కార్మికులకు ఏం చేశారని విజయోత్సవాలు?: సాంబశివ.
మదనపల్లిలో శనివారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్–ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు...
By Pagadala Venkateswar 2026-06-21 07:36:23 0 87
Telangana
11వ వార్డు వర్ష బాధితులకు కౌన్సిలర్ కార్తీక్ అండ
🎤కొమురం భీం భారత్ ఆవాజ్, ప్రతినిధి జగదీష్ నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఆసిఫాబాద్...
By Chunarkar Jagadeesh 2026-06-30 07:03:32 0 254
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com