Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె నీరుగట్టువారిపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం. రూ.10 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితుడు వెల్లడి.
Posted 2026-08-12 05:27:04
0
130
మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లిలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చౌడేశ్వరి కళ్యాణ మండపం సమీపంలో నిర్వహిస్తున్న గుజరి దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
నీరుగట్టువారిపల్లికి చెందిన చల్లా శివ గత కొన్నేళ్లుగా గుజరి దుకాణం నిర్వహిస్తున్నాడు. సాయంత్రం సమయంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో దుకాణంలో నిల్వ ఉంచిన అట్టలు, పేపర్, అల్యూమినియం, కాపర్, ఇనుము తదితర సామగ్రి పూర్తిగా దగ్ధమైంది.
సమాచారం అందుకున్న మదనపల్లె అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో రూ.10 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. ఘటనపై అగ్నిమాపక అధికారులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కష్టకాలంలో చేయూత.. లబ్ధిదారులకు చెక్కులు.|
"రూ.21.63 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి."
మేడ్చల్ మల్కాజిగిరి...
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈటల ప్రజావాణి.|
● నాగారం మున్సిపాలిటీలో బస్తీలు, కాలనీల్లో పర్యటించిన ఈటల రాజేందర్
● డ్రైనేజీ, సీసీ రోడ్లు,...
చిత్తవుతున్న యువత వీధిన పడుతున్న కుటుంబాలు మద్యం మాఫియా పై జి కోటేశ్వరరావు ఆగ్రహం
చిత్తవుతున్న యువత.. వీధిన పడుతున్న కుటుంబాలు: మద్యం మాఫియాపై :-
జి కోటేశ్వరరావు...
నిజామాబాద్: 27 వ డివిజాన్ లో చలివేంద్రం ప్రారంభం
నిజామాబాద్:ఈరోజు 27వ డివిజన్ వర్ని చౌరస్తాలో ఖిల్లా రామ్ మందిర్ ప్రధాన కార్యదర్శి కల్పే చిరంజీవి...
Architect of Progress: The Legacy of Shri Anil Mukim
Visionary Governance, Administrative Acumen, and Decades of Unwavering Service to Gujarat and...