రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న టెసరాక్ట్ అనే షెల్ కంపెనీకి రేవంత్ ప్రభుత్వం రూ.200 కోట్ల విలువైన భూమి కట్టబెట్టింది...K T R

0
171

రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న టెసరాక్ట్ అనే షెల్ కంపెనీకి రేవంత్ ప్రభుత్వం రూ.200 కోట్ల విలువైన భూమి కట్టబెట్టింది.

‎♦️ పక్క రాష్ట్రం కర్ణాటకలో మాజీ సీఎం సిద్ధరామయ్య సతీమణికి.. అక్కడి ప్రభుత్వం మూడెకరాల భూమి కేటాయించిందని బీజేపీ ఫిర్యాదు చేసింది.

‎♦️ ఆ వ్యవహారంలో లోకాయుక్త తీర్పు ఇచ్చింది. చివరికి సిద్దరామయ్య రాజీనామా చేసేదాకా వచ్చింది.

‎♦️ తెలంగాణలో టెసరాక్ట్ అనే కంపెనీకి అప్పనంగా భూమి కేటాయించారు.

‎♦️ టెసరాక్ట్ కంపెనీకి రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్.

‎♦️ ఆ విషయాన్ని కొండల్ రెడ్డే లింక్డ్‌ఇన్ ప్రొఫైల్లో పెట్టుకున్నాడు.

‎♦️ టెసరాక్ట్ కంపెనీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పరికరాలను తయారు చేస్తుందట.

‎♦️ అమెరికా ఎంబసీ ప్రతినిధితో హైదరాబాద్‌లో మీటింగ్ కూడా పెట్టారు.

‎♦️ యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ డెవలప్‌మెంట్ ఫోరంలో ఎగ్జిక్యూటివ్ బోర్డులో కొండల్ రెడ్డికి సభ్యత్వం ఇచ్చారు.

‎♦️ టెసరాక్ట్ కంపెనీకి కొండల్ రెడ్డి చైర్మన్ అని అమెరికా కాన్సులేట్ కూడా స్టేట్‌మెంట్ ఇచ్చింది.

‎♦️ చదువురాని రేవంత్ బ్రదర్స్ అందరూ సూట్లు కోట్లు వేసుకుని చైర్మన్లు అయిపోతున్నరు.

‎♦️ టెసరాక్ట్ కంపెనీ కథ ఏంటని మేం ఆరా తీశాం.

‎♦️ ఆ కంపెనీ ఫోన్ నంబర్ 123456789 అట. ఇలాంటి నంబర్లు ఉంటాయని మాకు తెల్వదు. రేవంత్ ఏదైనా కొత్త టెక్నాలజీ కనిపెట్టిండేమో?

‎♦️ విచిత్రం ఏంటంటే.. టెసరాక్ట్ కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా లేడు.

‎♦️ 2025 మార్చి 31 నాడు వాళ్లే ప్రకటన చేశారు. తమ కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా లేడని చెప్పారు.

‎♦️ ఊరూ పేరు లేని చోట ఆ కంపెనీ అడ్రస్ ఉంది.

‎♦️ టెసరాక్ట్ మూలధనం లక్ష రూపాయలు.

‎‎♦️ ఈ కంపెనీకి రేవంత్ ప్రభుత్వం రూ.200 కోట్ల విలువైన భూమి కట్టబెట్టింది.

‎♦️ ఐదెకరాల భూమిని కేటాయించి, అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు. ఇది అనుముల కొండల్ రెడ్డి వ్యవహారం.

‎♦️ అనుముల జగదీష్ రెడ్డి అని రేవంత్‌కు ఇంకో తమ్ముడు ఉన్నాడు.

‎♦️ జగదీష్ రెడ్డి అమెరికాలో ఉంటాడు.

‎♦️ రేవంత్ అమెరికా పర్యటనకు పోయినప్పుడు.. వెయ్యి కోట్ల డీల్ చేసుకున్నరు.

‎♦️ స్వచ్ఛ్ బయో అనే కంపెనీతో ఒక మెమోరాండం సైన్ చేశారు. వాళ్లకు ఎక్కడ భూములు ఇచ్చారో తవ్వి తీస్తాం.

‎♦️ రేవంత్ బామ్మర్ది సృజన్ రెడ్డికి రూ. 1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టు దక్కింది.

‎‎♦️ రేవంత్ రెడ్డి, మోదీ ప్రభుత్వం కలిసి నడుపుతున్న సింగరేణిలో.. సృజన్ రెడ్డి కనుసన్నల్లోనే అంతా నడుస్తోంది.

‎♦️ సైట్ విజిట్ సర్టిఫికెట్లు, వేల కోట్ల కుంభకోణాలు అన్నీ బయట పెట్టినం.

‎♦️ ఈ పరంపరలో మేం బయటపెట్టిన తాజా కుంభకోణమే టెసరాక్ట్.

‎♦️ వడ్డించే వాడే మనోడే అన్నట్టు భూములు కొట్టేశారు. రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని రూ.7 కోట్లకు రాసిచ్చారు. ఇది స్కాం కాదా?

‎♦️ పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా?

‎♦️ టెసరాక్ట్ కథేంటో తేల్చేదాకా వదిలిపెట్టం.

‎♦️ ఆ కంపెనీకి, ముఖ్యమంత్రి సోదరుడికి ఏ సంబంధం లేదని శ్రీధర్ బాబు అంటున్నడు.

‎♦️ చైర్మన్ అనుముల కొండల్ రెడ్డి అని వాళ్లే ప్రొఫైల్లో రాసుకున్నరు.

‎♦️ కానీ మంత్రి శ్రీధర్ బాబు సిగ్గులేకుండా బుకాయిస్తున్నరు.

‎♦️ అసలు ఇవన్నీ మంత్రికి తెలిసి జరుగుతున్నాయా?

‎♦️ మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుందా శ్రీధర్ బాబు గారు?

‎♦️ ఈ భూకేటాయింపుల కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం.

‎♦️ ముఖ్యమంత్రి సోదరులైతే ఏమైనా చేయొచ్చా?

‎♦️ సీఎం అన్న తిరుపతి రెడ్డికి ఏ అధికారిక హోదా ఉంది?

‎♦️ కలెక్టర్లు, ఎస్పీలు ఆయనకు వంగివంగి దండాలు పెడుతున్నరు.

Search
Categories
Read More
Andhra Pradesh
మంత్రి లోకేశ్ అభివృద్ధి చూసి పార్టీలోకి చేరికలు పెరిగాయి: MLA అదితి
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ పర్యటనను విజయవంతం చేసినందుకు ఎమ్మెల్యే అదితి...
By Boiena Rajesh 2026-08-23 09:42:15 0 113
Telangana
ఈ దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వండి.
Alert… ఈ దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈ ఫోటోలలో ఉన్న దొంగలు...
By Ponnala Srinivasrao 2026-05-03 16:53:32 0 145
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:లింగ వివక్షత, ఆరోగ్య సమస్యలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
సోమల మండలం, నంజమ్ పేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు లింగ వివక్షతపై మండల...
By Kothuru Murali 2026-02-23 12:26:19 0 445
SURAKSHA
Architect of Modern Policing: Dr. Sagar Preet Hooda, IPS
Visionary Leadership, Global Academic Acumen, and Decades of Unwavering Commitment to Public...
By Kalaga Sailaja 2026-07-28 11:00:11 0 164
Telangana
చాకలి ఐలమ్మ జీవితం నేటితరాలకు స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే శ్రీ గణేష్
 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిఖ్ విలేజ్ దోభీఘాట్...
By Sidhu Maroju 2025-09-26 09:01:30 0 361
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com