అన్నదానానికి రూ.లక్ష విరాళం

0
783

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి భక్తులు, దాతలు విశేషంగా సహకరిస్తున్నారు. ఇందులో భాగంగా పాల్వంచ కి చెందిన కట్టేకోలా యాదగిరి అన్నదాన కార్యక్రమానికి రూ.1,00,000 (లక్ష రూపాయలు) విరాళంగా దేవస్థానం ఈ ఓ దామోదర్ రావు కి అందజేశారు.శ్రీ సీతారామచంద్రస్వామివారి సేవలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో అన్నదానానికి ఈ విరాళాన్ని అందించినట్లు కట్టేకోలా యాదగిరి తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు నిరంతరం అన్నప్రసాదం అందించేందుకు దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం ఎంతో విశిష్టమైనదని ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఆహారం అందించడం ద్వారా స్వామివారి సేవలో భాగస్వాములు కావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.

ఈ సందర్భంగా ఆలయ ఈ ఓ,అధికారులు, సిబ్బంది దాత కట్టేకోలా యాదగిరిని అభినందించారు. స్వామివారి ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. దాత కుటుంబ సభ్యులకు శ్రీ సీతారామచంద్రస్వామివారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.ఈ సందర్బంగా ఈ ఓ దామోదర్ రావు మాట్లాడుతూ ... అన్నదాన కార్యక్రమానికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నరు . మరింత మంది భక్తులు, దాతలు ముందుకు వచ్చి అన్నదాన పథకానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమం భక్తుల్లో ఆధ్యాత్మిక భావనతో పాటు సేవా స్ఫూర్తిని పెంపొందిస్తోందని తెలిపారు.

References

Search
Categories
Read More
Telangana
పాఠశాల స్థల విస్తీర్ణం సరిహద్దుల నిర్ధారణ - సంబంధిత అధికారుల సర్వే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం డివిజన్ లో గల కౌకూర్...
By Sidhu Maroju 2025-12-19 14:20:11 0 329
Andhra Pradesh
నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం.
అన్నమయ్య జిల్లా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్య కోసం...
By Pagadala Venkateswar 2026-05-22 05:02:29 0 116
Dadra &Nager Haveli, Daman &Diu
Digital Census Phase Underway
The Union Home Ministry confirmed that house-to-house operations for Phase 1 of Census 2027 are...
By Dunna Jessicaruth 2026-05-20 11:39:36 0 156
Telangana
నిజామాబాద్
Heartiest birthday wishes to the Hon’ble President of India, Smt. Droupadi Murmu Ji. Her...
By Sadaq Sadaq 2026-06-20 12:01:54 0 222
SURAKSHA
మహిళా వేధింపులను అరికట్టేందుకు షీ టీమ్స్ నిరంతర గస్తీ
మహిళల భద్రతే ధ్యేయంగా తెలంగాణ పోలీస్ విభాగం ప్రవేశపెట్టిన 'షీ టీమ్స్' (SHE Teams) నిరంతరం...
By Kalaga Sailaja 2026-06-29 05:45:34 0 90
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com