కడెం నీటివిడుదల పై సమీక్షా సమావేశం నిర్వహించిన ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

0
170

మంచిర్యాల జిల్లా : నస్పూర్ సమీకృత కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కడెం ప్రాజెక్టు ఆయకట్టు పంట సాగునీటి లభ్యతపై జిల్లా కలెక్టర్  కుమార్ దీపక్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  పాల్గొని అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు,ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి తో, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కడెం ప్రాజెక్టు ఆయకట్టు పంట పొలాలకు సాగునీటిని విడుదల పై చర్చించడం జరిగిందని అన్నారు,వారి ఆదేశానుసారం రైతుల విజ్ఞప్తి మేరకు రేపు కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు.. దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాలకు చెందిన రైతులు పంటల సాగు చేపట్టాలని అన్నారు. రైతులు పండించే ప్రతి ఎకరాకు సాగునీటి అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.. నీటి వినియోగం, ప్రత్యామ్నాయ పంటల సాగు పై రైతులు దృష్టి పెట్టాలని కోరారు,రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీటిని అందించేందుకు అవసరమైన చేయను సమన్వయంతో చేపట్టాలని అధికారులకు సూచించారు, ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి సంబంధిత అధికారులు, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, లక్షెట్టిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు,

Search
Categories
Read More
Telangana
రైల్వే గేట్లకు ఇక గుడ్‌బై.|
▪ గౌతమ్‌నగర్ RUB, బొల్లారం ROB పనులకు కదలిక ▪ రైల్వే చీఫ్ ఇంజనీర్‌తో ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2026-09-19 13:34:42 0 64
Telangana
తెలంగాణలో ఐదు రోజులపాటు వర్షాలు.....
50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు తగ్గిన ఎండ తీవ్రత... 43 డిగ్రీలకు దిగొచ్చిన టెంపరేచర్లు.....
By Gujile Ramu 2026-05-07 02:11:24 0 163
Andhra Pradesh
నారా లోకేష్ బాబును కలిసిన ఐ టి డి పి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
రాష్ట్ మానవ వనరుల ఐటి ఎలక్ట్రానిక్స్ మరియు ఆర్టీజి శాఖల మంత్రి నారా లోకేష్ బాబును కలిసిన ఐ టి డి...
By Benguluri Madhubabu 2026-03-11 03:37:15 0 238
Maharashtra
Maharashtra Enhances Digital Governance and Citizen Services
Maharashtra is accelerating digital governance by expanding e-governance platforms and improving...
By Fathima Safa 2026-06-30 09:20:20 0 81
Andhra Pradesh
కనకదుర్గమ్మ కోవెల కు తెలుగు సినీ నటుడు సాయిధర్మతేజ్
ఈరోజు మధ్యాహ్నం తెలుగు సినీనటుడు శ్రీ సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ ) శ్రీ కనకదుర్గ అమ్మవారిని...
By Rajini Kumari 2026-01-06 11:00:05 0 245
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com