అభివృద్ధి చేయగానే ప్రజలు ఓట్లు వేయరు.. నా అనుభవంతో చెబుతున్నా: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.

0
106

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. అభివృద్ధి చేస్తే ప్రజలు గెలిపిస్తారా? వారి సమస్యలు తీరిస్తే ఓట్లు వేస్తారా? అనే అంశంపై తన రాజకీయ అనుభవాన్ని రంగరించి ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. అభివృద్ధి చేసినంత మాత్రాన ఎన్నికల్లో గెలుస్తామనుకోవడం పొరపాటని, ఓట్లు మానవ సంబంధాలపై ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. తన సొంత నియోజకవర్గంలో ఎదురైన ఒక సంఘటనను ఉదాహరణగా చూపుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 

తన సొంత నియోజకవర్గమైన పీలేరులోని 'మంచాలమంద' అనే మారుమూల గ్రామం గురించి కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు. "ఆ గ్రామానికి 9 కిలోమీటర్ల వరకు సరైన రోడ్డు ఉండేది కాదు. 1989లో ఎమ్మెల్యే అయినా, 2002 వరకు నేను ఆ ఊరికి వెళ్లలేకపోయాను. దాదాపు 800-900 ఓట్లున్న ఆ గ్రామానికి కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. అక్కడ ప్రజలకు సరైన ఇళ్లు, సాగునీటి వసతులు కూడా లేవు" అని నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు.

 

2004లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ఆయన తెలిపారు. "ఆ ఒక్క గ్రామానికే 500 ఇళ్లు మంజూరు చేశాం. 4 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా రెండు చెక్‌డ్యామ్‌లు నిర్మించాం. కోటి రూపాయల ఖర్చుతో 9 కిలోమీటర్ల రోడ్డు వేశాం. దీంతో గ్రామానికి బస్సు సౌకర్యం కూడా వచ్చింది. అంతేకాకుండా, ఎంపీపీ పదవిని కూడా ఆ గ్రామస్థులకే ఇచ్చాం" అని తాను చేసిన అభివృద్ధి పనులను వివరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మంగళగిరి ఫ్లైఓవర్ పై తప్పని ట్రాఫిక్ కష్టాలు
*మంగళగిరి ఫ్లై ఓవర్ పై తప్పని ట్రాఫిక్ కష్టాలు*   *సెలవు దినం అయిన మంగళగిరి ఫ్లై ఓవర్ పై...
By Rajini Kumari 2025-12-30 12:23:19 0 216
Telangana
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు : దుంపల రంజిత్ కుమార్
* మంచిర్యాల జిల్లా * ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారాలి * ఆర్టీసీని...
By Avunoori Mahesh 2026-04-23 08:05:09 0 202
Andhra Pradesh
సేవా సంకల్పంతో స్వచ్ఛ కదిరి వైపు అడుగులు
భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి : కదిరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా కదిరి పట్టణ...
By Vinod Kumar 2026-09-17 14:16:44 0 92
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి టిడిపి మండల కో కన్వీనర్ కశినేని మహేంద్ర నాయుడు
తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి పార్లమెంట్లో చట్టబద్ధత అమరావతి...
By Benguluri Madhubabu 2026-04-02 14:15:41 0 245
Andhra Pradesh
జస్టిస్ లావు నాగేశ్వరరావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం.
లండన్‌లోని ఇన్నర్ టెంపుల్ గౌరవ బెంచర్‌గా జస్టిస్ లావు నాగేశ్వరరావు ఎన్నిక భారత న్యాయ...
By Pagadala Venkateswar 2026-05-22 05:36:48 0 207
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com