ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ పాదయాత్ర...

0
125

దుండిగల్: దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు బీఆర్‌ఎస్‌ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

బౌరంపేట్‌లో భారీ వాహనాల రాకపోకలు పెరగడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో భారీ వాహనాల కారణంగా ట్రాఫిక్‌ జటిలంగా మారుతోందని తెలిపారు

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్‌ సంబంధిత అధికారులతో మాట్లాడి భారీ వాహనాల రాకపోకలను నియంత్రించడంతో పాటు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేలా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పాదయాత్రలో స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Bhogapuram airport inauguration
భోగాపురం టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం...
By G k Nookala 2026-08-01 06:31:21 0 170
Telangana
కార్పొరేషన్ లో కలిపారు సమస్యలను మరిచారు
‎దుండిగల్, మల్లంపేట మొన్న ,గ్రామపంచాయతీ, నిన్న మునిసిపాలిటీ, నేడు సైబ,రాబాద్ కార్పొరేషన్,ఇలా...
By Ponnala Srinivasrao 2026-03-01 06:16:43 0 581
Telangana
కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  ఈరోజు మహారాష్ట్ర లోని...
By Sidhu Maroju 2025-09-28 12:57:28 0 309
Telangana
పెద్దపల్లి : చెట్టును ఢీకొన్న కారు
ఎర్రగుంట్లపల్లి గ్రామ శివారులో గురువారం కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ధర్మారం మండలం...
By Sunka Santhosh 2026-07-30 14:08:42 0 204
Telangana
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో భారీగా మోహరించిన పోలీసులు. |
    హైదరాబాద్ : ఇవాళ  ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఓ ప్రైవేట్ షాపింగ్ మాల్ (ఓడియన్...
By Sidhu Maroju 2026-01-09 07:18:49 0 248
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com