తండ్రి అంత్యక్రియలకు వీడియో కాల్‌లో పాల్గొన్న కూతురు.. మానవత్వానికే మచ్చ అంటూ సజ్జనార్ ఫైర్

0
141

హరియాణాలోని సోనిపట్‌కు చెందిన ఒకప్పటి ప్రముఖ వ్యాపారవేత్త జీవిత చరమాంకంలో ఒంటరితనంతో కుమిలిపోతూ వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు.

‎ఆస్తులు, అంతస్తులు సంపాదించినా, పిల్లలను ఉన్నత స్థితిలో నిలబెట్టినా.. ఆయన చివరి ప్రయాణంలో మిగిలింది మాత్రం అనాథ శవంగా మారిన వేదనే. కుమార్తెలు కన్నతండ్రి కన్నుమూసినా కడసారి చూపుకైనా రాలేకపోయారు. ఆఖరికి అంత్యక్రియలను కూడా మొబైల్ ఫోన్‌లో వీడియో కాల్ ద్వారా వీక్షిస్తూ సరిపెట్టుకున్నారు. తండ్రి చివరి కార్యాల ఖర్చుల కోసం కేవలం రూ.5,100 పంపి తమ బాధ్యత తీరిపోయిందనుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన కన్నప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయి? అని ప్రశ్నించారు.

 

‎నేటి సమాజంలో యంత్రాల్లా మారుతున్న మానవ సంబంధాలు, మంటగలిసిపోతున్న నైతిక విలువలకు ఈ దృశ్యమే ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. చివరి క్షణాల్లో సాంకేతికత అందించే డిజిటల్ స్క్రీన్లు, ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్‌లు కన్నపేగు అనుబంధానికి ప్రత్యామ్నాయం కాగలవా? అని ప్రశ్నించారు. తల్లిదండ్రులు బతికున్నప్పుడు వారిని గుండెల్లో పెట్టుకుని ఆదరించడం, వారి ఆఖరి ఘడియల్లో తోడుగా నిలవడం పిల్లలుగా ప్రాథమిక ధర్మం అని సూచించారు. కన్నవారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేయడం, వారి మరణాన్ని కూడా వీడియో కాల్స్ ద్వారా చూస్తూ మమకారాలను తెంచేసుకోవడం అత్యంత శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వానికే మచ్చ తెచ్చే ఇలాంటి సంస్కృతి మారాలని ఫైర్ అయ్యారు. మిమ్మల్ని ఈ లోకంలోకి తెచ్చి, మీ భవిష్యత్తు కోసం తమ జీవితాలనే ధారపోసిన కన్నతండ్రి ఆఖరి ప్రయాణంలో తోడుగా నిలబడలేని ఈ విలాసవంతమైన, వ్యాపారాత్మక బతుకులు ఎందుకు? అని ప్రశ్నించారు. కోట్లు సంపాదించినా, ఉన్నత హోదాల్లో స్థిరపడినా కన్నవారి రుణం తీర్చుకోలేని చదువులు, సంస్కారం ఏ పాటివి? అని మండిపడ్డారు.

Search
Categories
Read More
Telangana
అంబేద్కర్ 135 వ జయంతి సందర్బంగా నివాళులు అర్పించిన : మినిస్టర్ వివేక్ వెంకటస్వామి
పెద్దపల్లి పట్టణానికి చేరుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. బడుగు,...
By Avunoori Mahesh 2026-04-14 05:37:32 0 252
Andhra Pradesh
పుంగనూరు: సుగాలి మిట్ట వద్ద ఢీకొన్న లారీలు
పుంగనూరు మండలం సుగాలి మిట్ట వద్ద శుక్రవారం రాత్రి రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కంటైనర్ తో...
By Kothuru Murali 2026-06-06 14:19:06 0 120
Andhra Pradesh
కదిరి పట్టణంలో ఈరోజు శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది
ఈరోజు ఉదయం కదిరి పట్టణంలోని శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమై...
By Benguluri Madhubabu 2026-03-10 13:55:33 0 224
SURAKSHA
: Suraksha Teams Ensure Women Safety Across Karnataka Public Places
Karnataka Police Suraksha Teams patrol buses, colleges, parks and markets to ensure women safety....
By Kalaga Sailaja 2026-07-01 11:48:33 0 336
Telangana
నిజామాబాద్: రఘునాథాలయ పరిసర ప్రాంతాల అధికారులు సందర్శన
నగరంలోని రఘునాథాలయం ఖిలా రామ మందిరంలో ఆలయ పరిసర ప్రాంతాలు అధికారులు పరిశీలించారని కమిటీ సభ్యులు...
By Sadaq Sadaq 2026-03-15 17:08:31 0 205
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com