చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి లో అంబులెన్స్ అందుబాటులో లేక గిరిజన బాలిక మృతి.

0
183

చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి లో అంబులెన్స్ అందుబాటులో లేక గిరిజన బాలిక మృతి చెందిన ఘటన ఈ రోజు జరిగింది. వివరాల్లోకి వెళితే పెద్ద సీతనపల్లి గ్రామానికి చెందిన సోడి పాపయ్య కుమార్తె లాస్య (4)కు మలేరియా జ్వరం తగిలింది. జ్వరం తగిలిన లాస్యను చింతూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ప్రాథమిక చికిత్సలు చేశారు ఆరోగ్యం మెరుగు అవ్వకపోవడంతో మెరుగైన చికిత్స కోసం భద్రాచలం రిఫర్ చేయగా అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో, ప్రైవేటు వాహనాలతో భద్రాచలం తీసుకెళ్లే స్తోమత లాస్య తల్లి తండ్రులకు లేకపోవడంతో లాస్య మృతి చెందింది. బిజెపి జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో మృత దేహం తో ఐటీడీఏ పి ఓ ఆఫీస్ ముందు. పెద్ద సీతనపల్లి గ్రామ గిరిజన బాలిక అంబులెన్స్ అందుబాటులో లేక మృతి చెందటం పట్ల బిజెపి జిల్లా కార్యదర్శి డి వి యస్ రమణా రెడ్డి ఆధ్వర్యంలో చింతూరు ఐ టీ డి ఎ ముందు లాస్య మృత దేహం తో ధర్నా నిర్వహించారు. మృతి చెందిన బాలిక విషయం పై సమగ్ర విచారణ చేయాలని, అలాగే చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ లు 24 గంటలు అందుబాటులో ఉంచాలని ధర్నా నిర్వహించారు. ఐ టీ డి ఎ అంబులెన్స్ కు ఐటిడిఏ పి ఓ డిజిల్ కొరత లేకుండా చూడాలని బిజెపి జిల్లా కార్యదర్శి డి వి యస్ రమణారెడ్డి పి ఓ శుభం నొక్వాల్ కు జరిగిన ఘటన వివరాలు వివరించారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
విశాఖ లో కూటమి నాయకుల మధ్య విబేధాలు
విశాఖ జిల్లాల్లో కూటమి విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి అధికార పార్టీ ఐన టిడిపి నాయకులు...
By Mobbu Venkatramana 2026-03-22 09:26:13 0 515
Andhra Pradesh
మదనపల్లెలో రాస్తారోకో - 30 మందికి 41 నోటీసులు జారీ.
మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్యకు నిరసనగా రాస్తారోకో నిర్వహించిన 30 మందికి డీఎస్పీ మహీంద్ర గురువారం...
By Pagadala Venkateswar 2026-02-20 06:29:59 0 188
Telangana
"అల్వాల్ పోలీసుల ఘనత: 18 గంటల్లోనే దొంగను పట్టి, బంగారం రికవరీ!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు...
By Sidhu Maroju 2026-04-22 17:33:32 0 364
Manipur
Manipur Strengthens Women Empowerment and Welfare
Manipur is advancing women empowerment and social welfare through targeted schemes aimed at...
By Fathima Safa 2026-06-24 11:53:40 0 246
SURAKSHA
తెలంగాణ పోలీసులు వర్ష బాధితులకు తక్షణ సహాయం
: ఈరోజు కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు సిటీ మార్కెట్ వద్ద వీధి వ్యాపారులకు...
By Kalaga Sailaja 2026-07-06 05:15:21 0 83
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com