చింతూరు: ఆగస్టు 8న మన్యం బంద్ కు గిరిజన సంఘం పిలుపు!

0
191

ఆగస్టు 8న తలపెట్టిన 'రాష్ట్ర మన్యం బంద్'ను జయప్రదం చేయండి ఆదివాసీ గిరిజన సంఘం పిలుపు. చింతూరు మండలం, తుమ్మల గ్రామంలో ముందస్తు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు & జనరల్ బాడీ సమావేశం. చింతూరు, ఆగస్టు, 6:, ఆగస్టు 8న నిర్వహించ తలపెట్టిన "రాష్ట్ర మన్యం బంద్" ను జయప్రదం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా తుమ్మల గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించడంతో పాటు, ముందస్తుగా 'ప్రపంచ ఆదివాసీ దినోత్సవం' (ఆగస్టు 9) పురస్కరించుకుని సంఘం జెండాను ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం. సురేష్ మాట్లాడుతూ... ఆదివాసీల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ, 1/70 చట్టం అమలు, పోడు భూములకు పట్టాల పంపిణీ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన మరియు జీవో నంబర్ 3 పునరుద్ధరణ వంటి న్యాయమైన డిమాండ్ల సాధనకై 'రాష్ట్ర మన్యం బంద్'ను చేపడుతున్నట్లు తెలిపారు. తరతరాలుగా అడవిని, ప్రకృతిని కాపాడుకుంటూ వస్తున్న గిరిజనుల హక్కులను కాలరాసే ప్రయత్నాలను అడ్డుకోవాలని, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీల సంస్కృతి, ఉనికిని గుర్తించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజనులందరూ తమ హక్కుల సాధనకు ముందుకు రావాలని కోరారు. ఆగస్టు 8న జరగబోయే ఈ మన్యం బంద్ కార్యక్రమంలో గిరిజనులు, గిరిజనేతర ప్రజలు, వ్యాపార వేత్తలు, కార్మికులు, యువకులు మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని, స్వచ్ఛందంగా మద్దతు తెలిపే బంద్ ను జయప్రదం చేయాల్సిందిగా ఆదివాసీ గిరిజన సంఘం విజ్ఞప్తి చేస్తోందాని అన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి పల్లపు. వెంకట్, గిరిజన సంఘం మండల కార్యదర్శి మొట్టం. రాజయ్య,సోడి దుర్గారావు, సోడి లెనిన్, పట్రా రమేష్, సోడి.అప్పారావు, సోడి తమ్మయ్య,మోట్టుమ్ సుబ్బారావు, మోట్టుమ్ వెంకటేష్, ఉయిక నాగేశ్వరరావు, మడకం నాగేశ్వరావు, ఉయిక రంగమ్మ, సోడి దూలమ్మ, కిట్టమ్మ, చామంతి, మడకం నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
SURAKSHA
H. Lalengmawia: Driving Mizoram's Progress with Vision
A dedicated 2005-batch AGMUT Cadre IAS officer, H. Lalengmawia serves as Commissioner &...
By Lokeshwari Panthadi 2026-07-23 11:14:39 0 165
Andhra Pradesh
ముగతి గ్రామంలో వరుసగా ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందడం చాలా బాధాకరం.
ముగ్గురు అన్నదమ్ముల వరుస మరణాలు… ముగతి గ్రామం శోకసంద్రం నందవరం మండలం ముగతి గ్రామంలో ఒకే...
By Boya Dasthagiri 2026-03-29 13:42:42 0 1K
Telangana
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్థిర ప్రతిష్ట : పాల్గొన్న ఎమ్మెల్యే
         మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మచ్చ బొల్లారం.  ...
By Sidhu Maroju 2025-08-10 16:18:13 0 780
Andhra Pradesh
వాళ్లు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు.. ఇక సహించేది లేదు: చంద్రబాబు.
  వాళ్లు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు.. ఇక సహించేది లేదు: చంద్రబాబు Andhra...
By Pagadala Venkateswar 2026-06-25 06:08:21 0 86
BMA
Karnataka Cops Refuse FIR for Threatened Journalist
In a severe dereliction of duty, Karnataka police allegedly refused to register an FIR after...
By JoinBMA 2026-09-11 06:46:55 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com