ముగతి గ్రామంలో వరుసగా ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందడం చాలా బాధాకరం.

0
1K

ముగ్గురు అన్నదమ్ముల వరుస మరణాలు… ముగతి గ్రామం శోకసంద్రం నందవరం మండలం ముగతి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు వరుసగా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది.గ్రామానికి చెందిన ఖాదర్ వలీ (72), అల్లావుద్దీన్ (69), మైద్దీన్ (62)లు కేవలం 16 రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది.మార్చి 18న అనారోగ్యంతో అల్లావుద్దీన్ మృతి చెందగా, ఆ బాధను తట్టుకోలేక మరుసటి రోజు మార్చి 19న మైద్దీన్ గుండెపోటుతో కన్నుమూశారు. అనంతరం ఇద్దరు తమ్ముళ్ల మృతితో తీవ్రంగా కలత చెందిన పెద్ద అన్న ఖాదర్ వలీ ఆదివారం (మార్చి 29) మృతి చెందడంతో ఈ విషాదం మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది.ఒకే కుటుంబంలో వరుసగా ముగ్గురు సోదరులు మరణించడం గ్రామంలో తీవ్ర శోకాన్ని నింపింది. గ్రామస్తులు కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ, ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
🏡 ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ... అభివృద్ధికి వేగవంతమైన కార్యాచరణ
🏡 ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ... అభివృద్ధికి వేగవంతమైన కార్యాచరణ టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో...
By Chennaiah Kati 2026-07-11 10:41:23 0 94
Andhra Pradesh
నిమ్మనపల్లి కేజీబీవీ పాఠశాల‌ను డీఈవో ఆకస్మిక తనిఖీ.
అన్నమయ్య జిల్లా డీఈవో సుబ్రహ్మణ్యం గురువారం నిమ్మనపల్లె కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ...
By Pagadala Venkateswar 2026-02-06 04:28:25 0 169
Andhra Pradesh
పుంగనూరు మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను...
By Benguluri Madhubabu 2026-03-08 13:19:01 0 228
Andhra Pradesh
Amaravati: రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు.. రెండు గంటల పాటు చర్చ.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది....
By Pagadala Venkateswar 2026-04-02 10:26:08 0 394
Andhra Pradesh
ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్
అధికారులే మీ వద్దకు.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్ కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామంలో...
By Patan Khuddus 2026-05-13 16:27:23 0 432
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com