డివైఎఫ్ఐ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించిన పట్టణ సీఐ కంబగిరి రాముడు
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆంధ్రప్రదేశ్ 16వ రాష్ట్ర మహాసభలు ఆగస్టు 28, 29, 30 తేదీల్లో నెల్లూరులో జరగనున్న సందర్భంగా మహాసభల ప్రచార కరపత్రాలను ఎమ్మిగనూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కంబగిరి రాముడు ఆవిష్కరించారు.
అనంతరం డివైఎఫ్ఐ ఎమ్మిగనూరు కన్వీనర్ విజయ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప,డివైఎఫ్ఐ నాయకులు అజిత్ మాట్లాడుతూ, దేశంలో నిరుద్యోగం రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ శాఖల్లో ఉన్న లక్షలాది ఖాళీలను భర్తీ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. ప్రైవేటీకరణ, కాంట్రాక్ట్ విధానాల కారణంగా శాశ్వత ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని, చదువుకున్న యువత ఉపాధి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతోందన్నారు.
గత ఏడాది కాలంగా డివైఎఫ్ఐ ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ అమలు, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ నియామకాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు, వినతిపత్రాల సమర్పణ, నిరసన కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. అలాగే డ్రగ్స్, గంజాయి, ఆన్‌లైన్ బెట్టింగ్, మద్యం వంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు, క్రీడా పోటీలు, రక్తదాన శిబిరాలు, మొక్కల నాటడం, శ్రమదానం వంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ యువతను చైతన్యవంతం చేస్తోందన్నారు.
భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలతో సామాజిక న్యాయం, లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణ కోసం డివైఎఫ్ఐ నిరంతరం పోరాడుతోందని, నెల్లూరులో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసేందుకు ప్రజలు, యువత తమ వంతు నైతిక, ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో డి వై ఎఫ్ ఐ నాయకులు రాకేష్, సురేష్, అభిషేక్, రాము తదితరులు పాల్గొన్నారు..
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz