గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

0
1K

సికింద్రాబాద్.. గాంధీ ఆసుపత్రిలో ఇటీవల నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆసుపత్రిని సందర్శించారు. గత నెల రోజులుగా కరోనా కేసులు దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఆదేశాల మేరకు తెలంగాణలోని నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు. కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంటును పరిశీలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రిలోని కొన్ని విభాగాలలో పెరుగుతూ రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గాంధీ ఆస్పత్రి వైద్య యంత్రాంగం నుండి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సూపరిండెంట్ రాజకుమారితో గాంధీ ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలు రోగులకు అందుతున్న వైద్య చికిత్సల గురించి చర్చించారు. ఇటీవల గాంధీ ఆసుపత్రిలో తాగునీటి సరఫరా సరిగా లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో రోగులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూపర్డెంట్ కు సూచించారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్వహణ లోపం లేకుండా సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సిటీ స్కాన్, ఎమ్మారై యంత్రాలు పనిచేసే విధంగా చూడాలని రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉందని సూపరిండెంట్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగా ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తానని స్పష్టం చేశారు.ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బంది యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Search
Categories
Read More
Telangana
అక్టోబర్ 23న పోలింగ్.. ఎన్నికల ఏర్పాట్లు పూర్తి |
తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ అక్టోబర్ 9న విడుదలైంది. మొత్తం 2,963...
By Bhuvaneswari Shanaga 2025-10-09 05:07:46 0 29
Andhra Pradesh
ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ 8 బిల్లులు ఆమోదం |
ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 8 ప్రభుత్వ బిల్లులను ఆమోదించింది. ఇందులో ఫ్యాక్టరీస్ (ఏపీ...
By Bhuvaneswari Shanaga 2025-09-23 06:01:34 0 51
Media Academy
An Inspirational Future In Journalism!
An Inspirational Future In Journalism Choosing A Career In Journalism Is A Decision To Serve...
By Media Academy 2025-04-28 19:25:11 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com