ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నా. చమర్తి

0
234

ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించిన - తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు. 

 

వీరబల్లె మండలం - నియోజకవర్గ పార్టీ కార్యాలయం - రాజంపేట పట్టణం. 

 

ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కూటమిపాలన సాగుతుందని నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు పేర్కొన్నారు. 

 

ఆదివారం నాడు వీరబల్లె మండలం/వంగిమళ్ళ గ్రామ గ్రామపంచాయతీ / ఉప్పరపల్లె నాగిరెడ్డిపల్లె నందు పర్యటిస్తూ "*రెండేళ్ల నమ్మకం - సంక్షేమం అభివృద్ధి"* పై ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో చమర్తి పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం గర్వించేలా అమరావతిని ఎకనామిక్ రీజియన్ గా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిదేన్నారు.అలాగే మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నట్లు చమర్తి జగన్ మోహన్ రాజు గారు పేర్కొన్నారు. 

 

అదేవిధంగా ఆయన మాట్లాడుతూ మాట ఇచ్చిన ప్రకారం ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్లు పెంచి అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

 

అంతేకాకుండా అన్నా క్యాంటీన్లో ఏర్పాటుచేసి ₹5 రూపాయలకే భోజనం అందిస్తున్న చరిత్ర మన కూటమి ప్రభుత్వాదేనన్నారు. గృహిణులకు సంవత్సరానికి దీపం పథకం ద్వారా అందించే మూడు గ్యాస్ సిలిండర్లపై మహిళలకు చైతన్యం చేశారు.

 

అంతేకాకుండా గత ప్రభుత్వం అమ్మ ఒడి పథకం ద్వారా ఒక ఇంట్లో చదువుకునే అందరికీ అమలు చేస్తామన్న జగన్ రెడ్డి కేవలం ఒక విద్యార్థికి అమలు చేయడం సిగ్గుచేటన్నారు.కానీ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో కుటుంబంలో అందరి పిల్లలకు తల్లికి వందనం పూర్తి పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు చమర్తి పేర్కొన్నారు. 

 

అదేవిధంగా చేనేతలకు,నాయి బ్రాహ్మణులకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నట్లు జగన్ మోహన్ రాజు గారు స్పష్టం చేశారు. 

 

రైతన్న కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా వగైరా అవసరమైన ఎరువులు సరఫరాలో ఎలాంటి జాప్యం లేకుండా అందజేస్తున్నామన్నారు.అలాగే రైతులకు వారి వ్యవసాయ పనులు పెట్టుబడులకు అందజేసే "అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం" ద్వారా ఎలాంటి తారతమ్యం లేకుండా నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

 

గత వైకాపా ప్రభుత్వం కన్నా మెరుగైన పాలన అందిస్తున్న విధానాలపై ప్రజలకు చైతన్యం చేశారు.అలాగే సంక్షేమ పథకాలు అర్హులైన వారు ఎవరైనా ఉంటే వారికి ఆయా సంక్షేమ పథకాలు అందించే బాధ్యత తీసుకుంటామని చమర్తి పేర్కొన్నారు.

 

ఆటో డ్రైవర్లకు ఆటో డ్రైవర్ సేవలో భాగంగా ₹15,000 లు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. గీత కార్మికులకు మద్యం షాపులో 10 శాతం రాయితీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం కల్పించినట్లు తెలియజేశారు.

 

ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం: తిరుమలలో సీఎం చంద్రబాబు.
    Chandrababu Naidu: శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం:...
By Pagadala Venkateswar 2026-03-21 14:15:35 0 197
Andhra Pradesh
పుంగనూరు:బోయకొండ ఆలయానికి హుండీ ద్వారా 35 లక్షల ఆదాయం: ఈవో
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు...
By Kothuru Murali 2026-03-27 14:26:54 0 207
Telangana
డీజీపీ శివధర్ రెడ్డికి లేఖ రాసిన ‎మంత్రి పొన్నం ప్రభాకర్!
పార్లమెంట్ లో తెలంగాణ విభజన పై భారత్ పాకిస్థాన్ తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ...
By Ponnala Srinivasrao 2026-04-17 01:44:44 0 150
Andhra Pradesh
మదనపల్లె: హత్య కేసులో నిందితుల అరెస్టు కోరుతూ ధర్నా.
మదనపల్లె మండలం సీటీఎం దళితవాడకు చెందిన మేస్త్రి మురళి (45) హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు...
By Pagadala Venkateswar 2026-04-29 04:56:45 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com