కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నేటి నుంచే ‘పోలీస్ యాక్ట్-30 అమలు జూలై 31 నుండి ఆగస్టు 31 వరకు ఆంక్షలు

1
427

🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతలను కాపాడేందుకు మరియు ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించేందుకు జూలై 31 నుండి ఆగస్టు 31 వరకు 30 పోలీస్ యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కాలంలో ప్రజలందరూ పోలీసు నిబంధనలకు సహకరించాలని, చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీస్ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా పెద్ద ఎత్తున గుమిగూడడం, సమావేశాలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధించబడింది. జిల్లాలో ఎలాంటి ప్రజా బహిరంగ కార్యక్రమాలు, ధర్నాలు, సభలు లేదా ర్యాలీలు నిర్వహించాలన్నా డీఎస్పీ, ఎస్పీ లేదా ఉన్నతాధికారుల నుండి ముందస్తుగా దరఖాస్తు చేసుకుని అనుమతి పొందడం తప్పనిసరి. అలాగే నిషిద్ధ ఆయుధాలు లేదా సమాజంలో నేరాలను, ఘర్షణలను ప్రేరేపించే ఎలాంటి వస్తువులను కలిగి ఉండరాదని స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు లేదా సభలు నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని, చట్టాన్ని ఉల్లంఘించిన వారు 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం శిక్షార్హులు అవుతారని పోలీస్ శాఖ పేర్కొంది. జిల్లా ప్రశాంతతను కాపాడేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ సంఘాల నాయకులు పోలీసు నిబంధనలను తప్పనిసరిగా పాటించి సహకరించాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి : భర్తను చంపిన భార్య ....!
భర్తను భార్య మంచం కోడుతో బాది హతమార్చిన ఘటన పెద్దపల్లి పట్టణంలో జరిగింది. S. I నరేష్ తెలిపిన...
By Sunka Santhosh 2026-07-02 04:39:52 0 283
SURAKSHA
ఆంధ్రప్రదేశ్ పోలీసుల సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి:
సైబర్ క్రైమ్ అవగాహన - తిరుపతి: తిరుపతిలోని పాఠశాలలు, కళాశాలల్లో ఏపీ సైబర్ సెల్ ఆధ్వర్యంలో అవగాహన...
By Kalaga Sailaja 2026-07-01 05:37:59 0 94
Telangana
Tomorrow medical shops closed
రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్   దేశవ్యాప్తంగా రేపు మందుల దుకాణాలు మూతపడనున్నాయి....
By G k Nookala 2026-05-19 12:24:58 0 227
Andhra Pradesh
పుంగనూరు: సిఆర్పిఎఫ్ జవాను మృతి పై వివరాలు తెలిపిన డి. ఎస్. పి.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ కు వై...
By Kothuru Murali 2026-01-23 13:01:57 0 221
Telangana
మహనీయులకు ఘన నివాళి.|
"జ్ఞానమాల కార్యక్రమంలో అంబేద్కర్, జ్యోతిరావు పూలే, గద్దర్ ఆశయాల స్మరణ" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-06 13:13:46 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com