ఇందిరా పార్క్ ధర్నాను జయప్రదం చేయండి: అఖిలపక్ష నాయకుల పిలుపు.

0
1K

ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా తేదీ 17జూన్ నాడు నిర్వహించే ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చెయ్యాలని నేడు షాపూర్ నగర్ ఏఐటీయూసీ కార్యాలయంలో వామపక్ష పార్టీల నాయకులు గోడపత్రికను విడుదల చెయ్యడం జరిగింది. సిపిఐ జాతీయ సమితి సభ్యులు యూసఫ్,జిల్లా కార్యదర్శి ఉమా మహేష్,సిపిఎం మండల కార్యదర్శి లక్ష్మణ్,సిపిఐ ఎమ్ ఎల్ నాయకులు అనురాధ,శివబాబు, మాస్ లైన్ కార్యదర్శి ప్రవీణ్,సిపిఎం నాయకులు అంజయ్య,సత్యం, స్వాతి లు తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశంలో మావోయిస్టు లను ఏరివేత పేరుతో చంపుతాం అని బహిరంగాగా ప్రకటించడం రాజ్యాంగం కల్పించిన మనిషి జీవించే హక్కును కాలరాయడమే నని, చర్చలు జరుపడానికి సిద్ధం అని ప్రకటించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమాని,ఇతర దేశాలతో చర్చలు జరుపడానికి సిద్దమైన ప్రభుత్వం,స్వంత పౌరులతో చర్చలు జరపకపోవడం బీజేపీ దుర్నితిని తెలియచేస్తుందని, ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టు లను అంతం అనే పేరుతో ఖనిజాలను అడవులను కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చెయ్యడేమనని పర్యావరణంను కాపాడుకోవాలంటే ఆపరేషన్ కాగార్ ను ఆపాల్సిందే నని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలాని కోరారు.  ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నర్సింహారెడ్డి,వంశీ, జంబూ,లక్ష్మి,సిపిఎం నాయకులు శ్రీను,కరుణాకర్,ఎమ్ డి బాషా తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మంత్రులు కలిసిన జిల్లా అధికార ప్రతినిధి బిజెపి నేత గుర్రాజ్ దేశాయ్
 శ్రీ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని మరియు మంత్రి శ్రీ టీజి భరత్ గారిని మర్యాదపూర్వకంగా...
By Boya Dasthagiri 2026-04-01 05:53:28 0 213
Prop News
The Green Premium Takes Over Commercial Office Spaces
The mandate for sustainable commercial real estate has officially reached a tipping point. As of...
By Dunna Jessicaruth 2026-05-20 10:52:39 0 158
SURAKSHA
Sikta Patnaik IAS: Driving Change Through Leadership
A dynamic Telangana IAS officer whose people-first governance, district administration, and...
By Lokeshwari Panthadi 2026-07-15 09:57:25 0 207
Telangana
నిజామాబాద్
Ahead of Bakrid , Nizamabad Police Commissioner P. Sai Chaitanya, IPS, conducted a surprise...
By Sadaq Sadaq 2026-05-23 21:36:36 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com