'భూమా'సురులనుండి రక్షించండి- భాధితుల ఆవేదన.|

0
239

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  తమకు చెందిన స్థలంలో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వు ఉండగా కొందరు ఆక్రమణదారులు కబ్జా చేసి ప్రహరీ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని బాధితులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

శనివారం అల్వాల్ మండల పరిధి పాకాల కుంట సర్వే నంబర్ 571లో గల 20 ఎకరాల స్థలంలో 10 ఎకరాలు తమ తాతల నుండి తమకు వచ్చిందని, అది కోర్టు వివాదంలో ఉండగా లయోలా అకాడమీ వారు బోర్డు పెట్టి, పరారీ నిర్మాణం చేరుతున్నారని బాదితులు జ్ఞానేశ్వర్, వెంకటేశ్వర్ కుటుంబ సభ్యులు, లలితా కుటుంబ సభ్యులు, శ్రీమన్నారాయణ, ప్రతాప్ సహా మరికొందరు బాదితులు వెల్లడించారు.

డిసెంబర్ 2024లో తాము కోర్టును ఆశ్రయించగా కోర్టు ఉత్తరువు ప్రకారం స్టేటస్కో వచ్చిందని, దానిని లెక్క చేయకుండా ఆక్రమణదారులు కబ్జా చేసి పరారీ గోడ ఏర్పాటు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత అధికారులైన పోలీస్ స్టేషన్లో, మండల కార్యాలయంలో, జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని బాధితులు ఆరోపించారు. తమ దగ్గర దానికి సంబంధించిన ధ్రువపత్రాలు అన్నీ ఉన్నాయని, కబ్జాదారు ఇక్కడ బౌన్సర్లను ఏర్పాటు చేసి లోనికి రానీయకుండా అడ్డుపడుతున్నారని, స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులతో చర్యలు తీసుకొని తమ స్థలాన్ని రక్షించి, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి జ్ఞానేశ్వర్ రుద్రమదేవి వారాల చిత్ర పాల్గొన్నారు.

 

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓయో రూంలో యువకుని ఆత్మహత్య
నిన్న రాత్రి సమయంలో శరీరం కుళ్లిన వాసన రావడంతో, పోలీస్ లకు సమాచారం ఇచ్చిన ఓయో హోటల్ యాజమాన్యం....
By Sidhu Maroju 2025-06-22 15:33:37 0 1K
SURAKSHA
Arpit Shukla: A Visionary IPS Leading Punjab Police Forward
The Journey Begins "Leadership in policing is not just about enforcing the...
By Fathima Safa 2026-08-01 04:24:56 0 185
Telangana
శ్రీ సమ్మక్క-సారలమ్మ మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ.|
హైదరాబాద్ : రెండేళ్లకు ఒక్కసారి అత్యంత వైభవంగా జరిగే తెలంగాణ కుంభమేళా.   ఈనెల 28 నుండి...
By Sidhu Maroju 2026-01-05 12:43:17 0 225
Telangana
వాడు ఎవరి కొడుకు అయినా వానికి చట్టరీత్యా శిక్ష పబ్లిక్ లో కూడా శిక్ష వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు
బండి సాయి భగీరథ్ మైనర్ అమ్మాయికి భయపడే రకమా? ‎కాలేజీలో విద్యార్థులను కొట్టి దూషించే బండి...
By Ponnala Srinivasrao 2026-05-10 02:32:05 0 149
Andhra Pradesh
పశువులకు వైద్య శిబిరం: నివారణ చర్యలపై అవగాహన
సోమల మండలం ఇరికిపెంట పంచాయతీలో పశువైద్యాధికారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. పశువుల...
By Kothuru Murali 2026-01-29 08:57:35 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com