సూపర్ ఎల్ నినో సమయంలో ప్రతి నీటి బొట్టు విలువైనదే: పవన్ కల్యాణ్.

0
102

రాష్ట్రంలో సూపర్‌ ఎల్‌నినో ప్రభావం వల్ల నెలకొన్న సాగునీటి కొరతపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టు ఎంతో అమూల్యమైనదని, కాలువల్లో పూడిక తీత, గట్ల లీకేజీల నివారణ వంటి తక్షణ చర్యల ద్వారా నీటి వృథాను అరికట్టాలని పిలుపునిచ్చారు.

 

 

డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి పరిస్థితులపై ఇరువురూ విస్తృతంగా చర్చించారు. నీటి ఎద్దడిపై రైతుల్లో అవగాహన కల్పించడంతో పాటు, ప్రత్యామ్నాయ సాగు మార్గాలపై దృష్టి సారించాలని పవన్ సూచించారు. రైతుల ఆందోళనను తగ్గించేందుకు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలన్నారు.

 

 

పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల రైతు ప్రయోజనాల కోసం ఏలేరు ప్రాజెక్టు నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేసినందుకు మంత్రి నిమ్మల రామానాయుడికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు తానే స్వయంగా ఏలేరు ఆయకట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు మంత్రి వివరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
టీడీపీ ప్రచార రథం ప్రారంభం: ప్రమాణ స్వీకారం విజయవంతం చేయాలని పిలుపు.
రాజంపేట పార్లమెంటు కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ ప్రచార రథాన్ని రాజంపేట పార్లమెంటు ప్రధాన...
By Pagadala Venkateswar 2026-02-28 07:00:37 0 176
Andhra Pradesh
వేటపాలెం మండలం నందు Gender Resource Centre ప్రారంభోత్సవం చేసిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య.
వేటపాలెం: వేటపాలెం మండలం నందు Gender Resource Center ప్రారంభోత్సవం చేసిన చీరాల శాసనసభ్యులు శ్రీ...
By Gadiyapudi Narendra 2026-02-18 16:03:15 0 242
SURAKSHA
Andhra Pradesh Police Implements Community Service Sentences for Minor Offenses
Many minor offenders, especially first-timers or youth, often struggle to find employment after...
By Kalaga Sailaja 2026-06-30 12:32:10 0 199
Andhra Pradesh
భోగి సంబరాల్లో వైసిపి నేత దేవినేని అవినాష్
*భోగి పర్వదినం* సందర్భంగా ఎన్టిఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో...
By Rajini Kumari 2026-01-14 12:42:20 0 211
Telangana
గుండెపోటుతో క్లాస్ రూంలోనే లెక్చరర్ మృతి
భరత్ అవాజ్ ప్రతినిధి :  హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో గల మహాత్మా జ్యోతిభాపులే జూనియర్...
By Prashanth Goindla 2026-02-02 18:07:35 0 487
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com