ఏపీ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 45 లక్షల ఓట్లు తొలగింపు.. మీ ఓటు ఉందో లేదో చూసుకోండి!

0
102

ఏపీలో ఓటర్ల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) అనంతరం దాదాపు 45 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగిస్తూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈరోజు ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. మరణించిన వారు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న వారి పేర్లను ఈ జాబితా నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు.

 

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) వివేక్ యాదవ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తొలగించిన ఓట్లలో శాశ్వతంగా చిరునామా మారిన లేదా అందుబాటులో లేని వారు 22.30 లక్షల మంది ఉన్నారు. మరణించిన వారివి 15.22 లక్షల ఓట్లు కాగా, రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు నమోదు చేసుకున్న 7.37 లక్షల మంది ఓట్లను కూడా తొలగించారు. ఈ సవరణ ప్రక్రియను జూన్ 15 నుంచి జూలై 24 వరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పకడ్బందీగా నిర్వహించారు.

 

ఈ సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 4,16,27,694 మంది ఓటర్లకు గాను 3.71 కోట్ల మంది (89.22%) నుంచి బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించారు. మిగిలిన 44.89 లక్షల మంది ఓటర్లు వారి చిరునామాలో అందుబాటులో లేకపోవడం, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం, ఫారాలు సమర్పించకపోవడం లేదా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఇష్టపడకపోవడం వంటి కారణాల వల్ల వారి వివరాలను సేకరించలేకపోయినట్లు సీఈఓ వివరించారు

Search
Categories
Read More
Andhra Pradesh
తాడేపల్లి లోని ఏం బుక్ కార్మికులను పగలు డ్యూటీలకు రావాలని కాంట్రాక్టర్ల ఒత్తిడి
తాడేపల్లి లోని ఎం బుక్ కార్మికులను పగలు డ్యూటీలకు రావాలని కాంట్రాక్టర్ల ఒత్తిడి మేరకు కార్మికులను...
By Rajini Kumari 2025-12-21 12:11:54 0 277
Andhra Pradesh
స్వాతంత్ర సమరయోధురాలు ముప్పాళ్ళ అరుంధతి దేవి గారు కన్నుమూశారు..
1930 దశకంలో గాంధీ మహాత్ముని పిలుపుమేరకు ఉన్నవ లక్ష్మీనారాయణ లక్ష్మీబాయమ్మ, వావిలాల గోపాలకృష్ణయ్య...
By John Baji 2025-12-25 14:12:58 0 252
SURAKSHA
AP Retired Cops: Blood Donors Saving Lives Daily
Yesterday retire అయిన AP police officers blood donation కి ముందు వరుసలో నిలబడ్డారు. "Raktam...
By Kalaga Sailaja 2026-07-03 13:52:42 0 112
Telangana
ఆఖరి వరకు ప్రయత్నం చేసి ఓడిపోయిన తల్లి – హృదయాన్ని కలచివేసిన బర్గీ డ్యామ్ ఘటన
జబల్‌పూర్ బర్గీ డ్యామ్ వద్ద జరిగిన విషాదకర ఘటన దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రేకెత్తిస్తోంది....
By Ponnala Srinivasrao 2026-05-02 02:54:42 0 156
Haryana
Haryana Cities Review Strategy for Monsoon Readiness
With the monsoon rapidly advancing across northern India, district administrations in Gurugram,...
By Lokeshwari Panthadi 2026-06-27 05:33:27 0 75
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com