బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలుగా నడికట్ల రోజా నియామకం. నియామక పత్రాన్ని అందజేసిన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.

0
1K

  మల్కాజిగిరి  జిల్లా కుత్బుల్లాపూర్ బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలు గా నడికట్ల రోజాను నియమించారు. శనివారం గండి మైసమ్మ బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన బీజేపీ సమావేశంలో భాగంగా పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా నడికట్ల రోజా మాట్లాడుతూ... పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకోవడం తనకి ఎంతో సంతోషంగా ఉందని, తనకిచ్చిన ఈ బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బిజెపి సీనియర్ నాయకులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, మల్లేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, ఆకుల విజయ్, రెడ్డం రాజేశ్వరి, వెంకటేష్ నాయక్, ఆంజనేయులు, విగ్నేష్ చారి, ఆకుల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సింగరాయకొండలో అగ్నిప్రమాదం.. పరిశ్రమ దగ్ధం |
ప్రకాశం జిల్లా:ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని ప్రముఖ పొగాకు పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం...
By Bhuvaneswari Shanaga 2025-10-10 10:52:39 0 24
Telangana
హైదరాబాద్‌ స్టాకింగ్‌ నేరాల్లో ముందంజ |
2023 NCRB (నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో) గణాంకాల ప్రకారం, తెలంగాణ రాష్ట్రం...
By Bhuvaneswari Shanaga 2025-10-01 04:38:07 0 27
Andhra Pradesh
ద్రోణి' హెచ్చరిక: 48 గంటలు....రాయలసీమకు వర్ష గండం |
బంగాళాఖాతంలో ఏర్పడిన 'ద్రోణి' తుఫాను కారణంగా రాగల 48 గంటల్లో చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురం...
By Meghana Kallam 2025-10-10 05:14:37 0 46
Telangana
ఘనంగా "తేజస్ గ్రాండ్ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ & కొంపల్లి రుచులు" ప్రారంభం.
జీడిమెట్ల 132 డివిజన్ అంగడిపేట్ డీ-మార్ట్ వద్ద నిర్వాహకులు ఉదయశ్రీ, పద్మావతి ఆధ్వర్యంలో నూతనంగా...
By Sidhu Maroju 2025-07-05 07:58:30 0 917
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com