గురు భక్తిలో ఎమ్మెల్యే.. సాయి సేవలో రాజశేఖర్ రెడ్డి.|

0
208

● సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

● రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం ప్రార్థన

మల్కాజిగిరి, జూలై 29: గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆల్వాల్, సాయి నగర్‌లోని శ్రీ సాయి బాబా దేవాలయంలో శ్రీ సాయి సమాజం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉందని, గురువు మార్గదర్శకత్వం వ్యక్తి జీవితంతో పాటు సమాజ నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కల్పన, మమతా రెడ్డి, మాజీ కార్పొరేటర్ మేకల సునీత, ఆలయ కమిటీ సభ్యులు వీరేశం యాదవ్, మల్లేష్ గౌడ్, లింగారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి, జేఏసీ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
మల్లారెడ్డికి మళ్లీ పెళ్లి..!?ఆయన ఇంట 50 ఏళ్ల పండగ
మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట రేపటి నుంచి పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. ఐదు రోజుల పెళ్లి వేడుకలకు...
By Ponnala Srinivasrao 2026-03-15 01:16:27 0 319
Telangana
రామనగర్‌లో పర్యటించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.. సమస్యలపై ఆరా.,|
● మురుగునీటి కాలువల సమస్యకు పరిష్కారం చూపాలని సూచన ● దెబ్బతిన్న విద్యుత్ స్తంభం స్థానంలో కొత్తది...
By Sidhu Maroju 2026-08-12 11:01:22 0 134
Andhra Pradesh
పుంగనూరు: మంత్రిని కలిసిన టీడీపీ మైనారిటీ నాయకులు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితా రెడ్డిని...
By Kothuru Murali 2026-01-21 09:38:35 0 212
SADHANA
Nomination for the Sardar Patel Unity Award 2025 🇮🇳🤝......
Recognising the outstanding & inspiring efforts made by citizens & institutions in...
By Bharat Aawaz 2025-07-03 07:35:36 0 2K
Andhra Pradesh
కన్నకూతురే మోసం చేసిందని కలెక్టర్‌కు తల్లిదండ్రుల ఫిర్యాదు.
మదనపల్లి నర్సింగ్‌ హోం వీధికి చెందిన షేక్ ఖాసీమ్ సాబ్, షహనాజ్ దంపతులు తమ కూతురు షేక్ రఫియాపై...
By Pagadala Venkateswar 2026-03-09 09:15:51 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com