ఆదోని మెడికల్ కాలేజీ పై నారా లోకేష్ పర్యటనలో స్పష్టమైన ప్రకటన చేయాలి

0
133

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో కర్నూల్ జిల్లా పచ్చిమ ప్రాంతం విద్యార్థులు, యువత, ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న విద్యా, వైద్య అవసరాలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పట్టణ కన్వీనర్ S. విజయ్ కుమార్ మాట్లాడుతూ

ఆదోని వంటి పెద్ద పట్టణం లక్షలాది మంది ప్రజలకు కేంద్రంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ మెడికల్ కళాశాల లేకపోవడం ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం అని అన్నారు. వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు అధిక ఫీజులు భరించలేక తమ వైద్య విద్య లక్ష్యాన్ని వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్నారు. మరోవైపు మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులో లేక ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అందువల్ల ఆదోని మెడికల్ కళాశాలను ప్రభుత్వమే పూర్తిస్థాయిలో నిర్మించి, దానికి అనుబంధంగా అత్యాధునిక ప్రభుత్వ బోధనాసుపత్రిని ఏర్పాటు చేయాలి. ఇది కేవలం ఒక విద్యాసంస్థ మాత్రమే కాదు; కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం ప్రజల ఆరోగ్య హక్కును బలోపేతం చేసే కీలకమైన చర్య.

అదే సమయంలో ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను అవసరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ఉన్న హాస్టళ్లలో సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు, విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.

విద్యను అందరికీ అందుబాటులో ఉంచడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత. విద్యార్థులకు నాణ్యమైన ప్రభుత్వ విద్య, వసతి, వైద్య విద్య అవకాశాలు కల్పించకుండా యువత భవిష్యత్తు గురించి మాట్లాడటం సరిపోదు. అందువల్ల మంత్రి నారా లోకేష్ ఈ పర్యటనలోనే ఆదోని ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణంపై స్పష్టమైన ప్రకటన చేసి, పనులు ప్రారంభించే కాలపట్టికను ప్రకటించాలిని. డివైఎఫ్ఐ డిమాండ్ చేశారు. ఈ ప్రాంత విద్యార్థులు, యువత, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని. లేనిపక్షంలో విద్యార్థులు, యువతతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా విస్తృత ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తోంది. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు అగ్గి రాముడు, అఖిల్, విష్ణు, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
తెలంగాణ పోలీసు సైబర్ సెల్: ఆన్‌లైన్ మోసాలపై అవగాహన
సైబర్ నేరాల నుండి ప్రజలను రక్షించేందుకు తెలంగాణ పోలీసు సైబర్ సెల్ ఈరోజు IT ఉద్యోగులకు అవగాహన...
By Kalaga Sailaja 2026-07-06 05:08:28 0 82
Andhra Pradesh
రెండు కోట్లు ఆస్తి దానం చేసిన దంపతులు
*రూ.2 కోట్లు ఆస్తి దానం చేసిన దంపతులు*   ఆంద్రప్రదేశ్ నంద్యాల జిల్లా జలదుర్గానికి చెందిన...
By Rajini Kumari 2026-01-20 11:04:15 0 229
Andhra Pradesh
Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం: నారా లోకేశ్.
    Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం: నారా లోకేశ్...
By Pagadala Venkateswar 2026-02-13 07:46:33 0 190
Andhra Pradesh
ఆటో డ్రైవర్ కు 22 నెలల జైలు కారణం మీదే.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కారణమైన కేసులో ఆటో డ్రైవర్ కు 20 నెలల జైలు శిక్ష పదివేల జరిమానా...
By John Baji 2025-12-31 01:27:27 0 223
Telangana
అధికారుల నిర్లక్ష్య వైఖరి?
కరీంనగర్ ఆరెపల్లి రోడ్డు డీమార్ట్ వెళ్లే దారిలో ట్రాక్టర్లు టిప్పర్లు ప్రజలకు ఇబ్బంది కలిగే...
By Thalakokkula Sadanandam 2026-05-02 04:21:13 0 608
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com