C M Revanth reddy in delhi

0
153

ఢిల్లీ: తెలంగాణ‌కు ప్ర‌ధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11,56,915 ఇండ్ల‌ను కేటాయించాల‌ని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శ్రీ శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ గారికి ముఖ్య‌మంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త‌ర్వాత పేద‌ల‌కు సొంత ఇల్లు నిర్మించి ఇవ్వ‌డానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు.

 

✅ ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు పలువురు ఎంపీలతో కలిసి కృషి భ‌వ‌న్ లో కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాన్ని వివ‌రించారు. గత ప్రభుత్వం PMAY-G ను వినియోగించుకోక‌పోవ‌డంతో రాష్ట్రంలో గ‌త ప‌దేళ్లు పేద‌లు సొంత ఇళ్లు నిర్మించుకోలేకపోయారని, ఇప్పుడు తీవ్ర డిమాండ్ నెల‌కొంద‌ని తెలిపారు. 

 

✅ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించిన ఆవాస్ ప్లస్ (Awaas+) యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వ‌హించిన స‌ర్వేలో 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించిన‌ట్లు ముఖ్యమంత్రి గారు వివరించారు. సాధ్య‌మైనంత త్వ‌రగా తెలంగాణ‌కు ఇళ్లు కేటాయించాల‌ని కేంద్ర మంత్రిని కోరారు.

 

✅ ఎల్‌నినో, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేప‌థ్యంలో విక‌సిత్ భార‌త్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ)లో (వీబీ జీ రామ్ జీ) అద‌న‌పు ప‌నులను చేర్చాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. వ‌ర్షాభావంతో ప‌నులు లేనందున ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, రైతు కూలీల‌కు జీవ‌నోపాధులు మెరుగుప‌ర్చేందుకు, పంటల వైవిధ్యీకరణ ప్రోత్సాహానికి అద‌న‌పు ప‌నులను చ‌ట్టంలో చేర్చాల‌ని కోరారు.

 

✅ రైతులు త‌మ భూముల్లో కూర‌గాయ‌ల పందిళ్లు, ప‌శుగ్రాస ప్లాట్ల అభివృద్ధి, మల్బరీ తోటల సాగు, పట్టు పురుగుల పెంపకం షెడ్లు, ఇళ్ల స‌మీపంలో ఆకు కూర‌లు, కూర‌గాయ‌ల తోట‌లు, వెదురు వ‌నాలు పెంచుకునే ప‌నులను వీబీ జీ రామ్ జీలో చేర్చాల‌ని కేంద్ర మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు.

 

✅ కొండ ప్రాంతాల‌తో పాటు కొండ వాలుల్లో నీటి నిల్వ చేసుకునే కంద‌కాలు, ఇప్పటికే ఉన్న ప్లాంటేషన్లు, పండ్ల తోటల్లో తేమ ర‌క్ష‌ణ‌కు కంద‌కాల నిర్మాణం, వ‌ర‌ద‌లు, ఇసుక మేట‌ల‌తో దెబ్బ‌తిన్న భూముల పున‌రుద్ధ‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన ప‌నులు వీబీ జీ రామ్ జీలో చేప‌ట్టాల‌ని కోరారు. 

 

✅ ముఖ్య‌మంత్రి వెంట ఎంపీలు ఎం అనిల్ కుమార్ యాదవ్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, డాక్ట‌ర్ మల్లు రవి గారు, పోరిక బలరాం నాయక్ గారు, సురేష్ షేట్కార్ గారు, చామ‌ల కిరణ్ కుమార్ రెడ్డి గారు, రామసహాయం రఘురాం రెడ్డి గారు, గడ్డం వంశీ కృష్ణ గారు, ఎక్స్-అఫిషీయో స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ రామ‌కృష్ణారావు గారు, సెక్ర‌ట‌రీ కో-ఆర్డినేష‌న్ అద్వైత్ కుమార్ సింగ్ గారున్నారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ...
By Ponnala Srinivasrao 2026-05-13 01:45:22 0 150
SURAKSHA
After Uniform: Telangana Police Serve Society Daily
Retired అయిన తర్వాత Telangana Police officers daily basis మీద society కి సేవ చేస్తున్నారు. Slum...
By Kalaga Sailaja 2026-07-03 11:11:19 0 185
Andhra Pradesh
A p new map with capital amaravathi
*అమరావతితో ఆంధ్రప్రదేశ్‌ కొత్త మ్యాప్.28 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌ను ఏపీ డిజాస్టర్...
By G k Nookala 2026-04-05 03:16:18 0 283
Rajasthan
Rajasthan Boosts Industrial Investment and MSME Growth
Rajasthan is strengthening its industrial economy by attracting fresh investments and promoting...
By Fathima Safa 2026-06-30 12:15:08 0 110
Telangana
కరీంనగర్ PMJ జూవెలర్స్ లో భారీ చోరి
న్యూస్ టుడే కరీంనగర్  ఈరోజు 10:40 PMJ గోల్డ్బై షాప్ఆ రుగురు  చైన కొనడానికి వచ్చి గన్...
By Bouth Arun 2026-05-03 12:59:58 0 327
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com