Bharat Aawaz

స్థానిక ఎన్నికలపై పవన్ ఫోకస్.. సమన్వయ కమిటీకి కీలక ఆదేశాలు.

Pagadala Venkateswar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
145
Views

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిన్న సాయంత్రం స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణులు అందించిన సమాచారాన్ని క్రోడీకరించి, నివేదించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీతో ఈ భేటీ నిర్వహించారు.

 

ఈ సందర్భంగా కమిటీ విధివిధానాలు, బాధ్యతలపై పవన్ కల్యాణ్ సభ్యులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమగ్ర సమాచారంతో నివేదికలు సిద్ధం చేయాలని, సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు వివరాలను తనకు నివేదించాలని సూచించారు. కమిటీ కార్యకలాపాలకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.