Madanapalle: మదనపల్లె నక్కలదిన్నె డేగల రామయ్య వీధిలో గత 7 నెలలుగా పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.
Posted 2026-07-28 05:25:53
0
79
మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని నక్కలదిన్నె డేగల రామయ్య వీధిలో గత ఏడు నెలలుగా కాలువలు, చెత్తను శుభ్రం చేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీధివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలు పూర్తిగా మురుగునీరు, చెత్తతో నిండిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని, దోమల బెడద కూడా పెరిగి ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడే పరిస్థితి ఏర్పడిందన్నారు.
పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి కాలువలను శుభ్రం చేయించి, చెత్తను తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని నక్కలదిన్నె డేగల రామయ్య వీధి ప్రజలు విజ్ఞప్తి చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్
బొబ్బిలి మండలం అలజంగి వేగావతి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను రెవెన్యూ...
ఒక నిబద్ధత గల ఒక మంచి మనిషిని తెలంగాణ కోల్పోయింది ! శ్రీను రావు పొన్నాల
తెలంగాణ ఏర్పాటు కోసం వీరోచితంగా పోరాటం చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నివాళి !...
కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి.
మదనపల్లె నూతన తహసీల్దార్‌గా మాధవి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్‌లో...
“మల్లారెడ్డి కాలనీలో ట్రాఫిక్ పరిష్కారానికి చర్యలు – ప్రత్యామ్నాయ రోడ్‌పై చర్చ”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్లారెడ్డి కాలనీలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలపై స్థానిక నివాసితులు...
అందరికీ సకల శుభాలు కలగాలి మంత్రి ఆనం
*తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి : మంత్రి ఆనం*
*అందరికీ సకల శుభాలు...